logo

ముగిసిన నాటిక పోటీలు

విశాఖ జిల్లా అనకాపల్లి వీవీ రమణ రైతు భారతి ఆడిటోరియంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి నాటిక పోటీలు శనివారం రాత్రితో ముగిశాయి.

Published : 03 Apr 2022 06:21 IST


‘లక్ష్మణరేఖ దాటితే’ నాటిక బృందానికి బహుమతి అందిస్తున్న రత్నాకర్‌

అనకాపల్లి, న్యూస్‌టుడే: విశాఖ జిల్లా అనకాపల్లి వీవీ రమణ రైతు భారతి ఆడిటోరియంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి నాటిక పోటీలు శనివారం రాత్రితో ముగిశాయి. జ్యోతి సరళ స్మారక కళాపరిషత్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీలలో విజేతలకు డైమెండ్‌ హిట్స్‌ సాంస్కృతిక సంస్థ ఛైర్మన్‌ దాడి రత్నాకర్‌, వైకాపా నాయకులు కొణతాల భాస్కరరావు, బి.బాబ్జిలు బహుమతులు అందజేశారు. ప్రముఖ రంగస్థల కళాకారులు ఎస్‌ఏ శ్రీరామమూర్తిని మాజీ మంత్రి దాడి వీరభద్రరావు సత్కరించారు. పోటీల నిర్వహుకులు పీసీహెచ్‌ నాయుడు, బొడ్డేడ జగత్రావు, కేఎం నాయుడు పాల్గొన్నారు. శనివారం ప్రదర్శించిన ‘జీవనయానం’, ‘చింతచచ్చినా’ నాటికలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

* మిత్రాక్రియేషన్స్‌ గుంటూరు జిల్లా నరసరావుపేటకు కళాకారులు ప్రదర్శించిన ‘లక్ష్మణరేఖ దాటితే’ నాటికకు ప్రథమ బహుమతి లభించింది. ద్వితీయ, తృతీయ బహుమతులు ప్రకాశం జిల్లా కరపదికి చెందిన ప్రకాశం కళాపరిషత్‌ కళాకారులు ప్రదర్శించిన ‘పాశం’, ఒంగోలుకు చెందిన జనచైతన్య కళాకారులు ప్రదర్శించిన ‘జీవనయానం’ నాటికలకు దక్కాయి. ఉత్తమ నటునిగా చంద్రశేఖర్‌ (చీమచీమా ఎందుకు పుట్టావ్‌), నటిగా జ్యోతిరాణి (పాశం), దర్శకునిగా ఎస్‌.ఎం.భాషా (లక్ష్మణరేఖ దాటితే), విలన్‌గా సర్వేశ్వరరావు (పయనం), హాస్యనటిగా టి.లక్ష్మి (లచిందేవి లైను తప్పింది), సహాయ నటునిగా మృదంగం (పాశం) బహుమతులు అందుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు