logo

పిన్నీసే ఆయుధం.. పది నిమిషాల్లో బైకు మాయం

ఎంత ఖరీదైన బైకు అయినా సరే పిన్నీసుతో మాయం చేస్తారు. ముందుగా హ్యాండిల్‌ ల్యాక్‌ను బలంగా చేతితో తిప్పి తాళాన్ని తొలగిస్తున్నారు. ఆ తర్వాత పిన్నీసుతో వైర్లను కలిపి బైకును స్టార్ట్‌ చేస్తున్నారు. ఇదంతా పది నిమిషాల వ్యవధిలో పూర్తి చేస్తున్నారు. నిందితులు గతంలో జైలులో ఉన్నప్పుడు తోటి ఖైదీల నుంచి ఈ మెలకువలు నేర్చుకున్నారు.

Updated : 25 Jun 2022 06:25 IST

24 వాహనాల స్వాధీనం

నిందితుల అరెస్టు

పాయకరావుపేట, న్యూస్‌టుడే

బైకులను పరిశీలిస్తున్న నర్సీపట్నం ఏఎస్పీ మణికంఠ

ఎంత ఖరీదైన బైకు అయినా సరే పిన్నీసుతో మాయం చేస్తారు. ముందుగా హ్యాండిల్‌ ల్యాక్‌ను బలంగా చేతితో తిప్పి తాళాన్ని తొలగిస్తున్నారు. ఆ తర్వాత పిన్నీసుతో వైర్లను కలిపి బైకును స్టార్ట్‌ చేస్తున్నారు. ఇదంతా పది నిమిషాల వ్యవధిలో పూర్తి చేస్తున్నారు. నిందితులు గతంలో జైలులో ఉన్నప్పుడు తోటి ఖైదీల నుంచి ఈ మెలకువలు నేర్చుకున్నారు.

చోరీ కేసుల్లో 24 బైకులను స్వాధీనం చేసుకుని ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు నర్సీపట్నం ఏఎస్పీ మణికంఠ పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పట్టణ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం సాయంత్రం కేసు వివరాలను వెల్లడించారు. ఈ నెల 20న నాతవరం నుంచి పేటలో బంధువుల ఇంటికి వచ్చిన ఓ వ్యక్తి బైకు చోరీ జరిగిందని ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు అరట్లకోట రోడ్డులో బుల్లెట్‌పై అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విశాఖ జిల్లా చినగంట్యాడలోని శ్రామిక్‌నగర్‌కు చెందిన ఉలవల రాజేష్‌బాబు, కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురానికి చెందిన ఉండ్రు నాగరాజుగా గుర్తించారు. విచారణలో తొమ్మిది బుల్లెట్‌ల సహా మొత్తం 24 బైకులను చోరీ చేసినట్లు నిందితులు వెల్లడించారు. బైకులను ఏవిధంగా చోరీ చేస్తారో నిందితులిద్దరూ పోలీసుల సమక్షంలో చేసి చూపారు. విశాఖపట్నం, రాజమహేంద్రవరం, పాయకరావుపేట, ఆలమూరు, దువ్వాడ తదితర చోట్ల చోరీలకు పాల్పడ్డారని ఏఎస్పీ మణికంఠ చెప్పారు. నిందితులను పట్టుకున్న పోలీసు సిబ్బందికి నగదు రివార్డులు అందజేశారు. సీఐ నారాయణరావు, ఎస్సైలు ప్రసాదరావు, శిరీష, ఏఎస్సై గోవిందు పాల్గొన్నారు.

(అంతర్‌ చిత్రం) నిందితులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని