logo

పడి లేస్తూ.. ప్రగతి సాధిస్తూ..

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ల పూర్తవున్న నేపథ్యంలో దేశంలోనే తొలితరం నౌకా నిర్మాణ కేంద్రమైన విశాఖపట్నం ‘హిందుస్థాన్‌ షిప్‌యార్డు లిమిటెడ్‌’ (పూర్వం ‘సింధియా స్టీమ్‌ నావిగేషన్‌’గా పిలిచేవారు) అనేక మైలురాళ్లు దాటింది. అప్పట్లో దేశంలోనే ప్రముఖ వ్యాపారవేత్తగా పేరొందిన మహారాష్ట్రకు

Published : 10 Aug 2022 05:35 IST

నాడు ‘సింధియా స్టీమ్‌ నావిగేషన్‌’

నేడు ‘హిందుస్థాన్‌ షిప్‌యార్డు’

న్యూస్‌టుడే, సింధియా

1942లో సింధియా స్టీమ్‌ నావిగేషన్‌ సంస్థ నిర్మాణ పనులు

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ల పూర్తవున్న నేపథ్యంలో దేశంలోనే తొలితరం నౌకా నిర్మాణ కేంద్రమైన విశాఖపట్నం ‘హిందుస్థాన్‌ షిప్‌యార్డు లిమిటెడ్‌’ (పూర్వం ‘సింధియా స్టీమ్‌ నావిగేషన్‌’గా పిలిచేవారు) అనేక మైలురాళ్లు దాటింది. అప్పట్లో దేశంలోనే ప్రముఖ వ్యాపారవేత్తగా పేరొందిన మహారాష్ట్రకు చెందిన ‘శేఠ్‌ వాల్‌చంద్‌ హీరాచంద్‌’ మదిలో మెదిలిన నౌకానిర్మాణ పరిశ్రమ స్థాపన ఆలోచనను మహాత్మాగాంధీ, డాక్టర్‌ బాబూరాజేంద్రప్రసాద్‌ వంటి మహనీయులతో పంచున్నారు.

* విశాఖపట్నం సముద్ర తీరంలో 1941 జూన్‌ 21న నిర్వహించిన సంస్థ భూమిపూజకు గాంధీజీ రావాల్సి ఉన్నా.. స్వాతంత్య్ర ఉద్యమంలో తీరిక లేకపోవడంతో ఆయన పర్యటన రద్దయింది. అప్పటి భారత జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షులుగా ఉన్న డాక్టర్‌ బాబూరాజేంద్ర ప్రసాద్‌ ‘సింధియా స్టీమ్‌ నావిగేషన్‌’ సంస్థ నిర్మాణ పనులను ప్రారంభించారు. స్వాతంత్య్రం రాక ముందే పరిశ్రమ పనులు అయిదేళ్ల పాటు చురుగ్గా కొనసాగాయి. ఆ తర్వాత స్వాతంత్రం రాకతో దశల వారీగా యార్డుని ఆధునికీకరించారు. నిర్మాణ పనులకు అవసరమైన కార్మినులను నగరం నుంచి పంటీలపై యార్డు వెనుక ఉన్న సముద్ర జలాలు మీదుగా తరలించేవారు.

అప్పట్లో సంస్థకు కుడివైపు ఉన్న కొండ (ప్రస్తుతం డాల్ఫిన్‌ కొండ) సమీప సముద్ర ఒడ్డు నుంచే పంటె ద్వారా నగరంలో రాకపోకలు సాగేవి. ఈ మార్గంలో ఉండే గేటుని అప్పట్లోనే ‘గాంధీ గేటు’గా పిలిచేవారు. 1952 తర్వాత సింధియా స్టీమ్‌ నావిగేషన్‌ సంస్థను భారత ప్రభుత్వం ‘హిందుస్థాన్‌ షిప్‌యార్డుగా లిమిటెడ్‌’గా పేరు మార్చింది. ఆ తర్వాత యార్డు అనేక ఒడుదొడుకులను ఎదుర్కొంటూ... ముందుకు సాగుతుంది. రానున్న నాలుగేళ్లలో షిప్‌యార్డులో అన్ని కీలక విభాగాలను మరింత ఆధునికీకరించేందుకు యాజమాన్యం వ్యూహాత్మక ప్రణాళిక సిద్ధం చేస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని