logo

ప్రత్యేక రైళ్ల గడువు పెంపు

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పలు ప్రత్యేక రైళ్ల గడువు పెంచుతున్నట్లు వాల్తేర్‌ సీనియర్‌ డీసీఎం ఎ.కె. త్రిపాఠి తెలిపారు.

Published : 22 Dec 2022 04:22 IST

రైల్వేస్టేషన్‌, న్యూస్‌టుడే: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పలు ప్రత్యేక రైళ్ల గడువు పెంచుతున్నట్లు వాల్తేర్‌ సీనియర్‌ డీసీఎం ఎ.కె. త్రిపాఠి తెలిపారు. ధన్‌బాద్‌-ఎర్నాకుళం(03357) వారాంతపు ప్రత్యేక రైలు ఈ నెల 25 నుంచి జనవరి 29 వరకు ప్రతి ఆదివారం ఉదయం 6 గంటలకు ధన్‌బాద్‌లో బయలుదేరి మర్నాడు తెల్లవారుజామున 3 గంటలకు విశాఖ చేరుకొని, ఇక్కడి నుంచి 3.20 గంటలకు బయలుదేరి మంగళవారం ఉదయం 8 గంటలకు ఎర్నాకుళం చేరుకుంటుందన్నారు.

* ఎర్నాకుళం-ధన్‌బాద్‌(-03358) ప్రత్యేక రైలు ఈ నెల 27 నుంచి జనవరి 31 వరకు ప్రతి మంగళవారం రాత్రి 9 గంటలకు ఎర్నాకుళంలో ప్రారంభమై మర్నాడు రాత్రి 11.15 గంటలకు విశాఖ చేరుకొని, ఇక్కడి నుంచి 11.35 గంటలకు బయలు దేరి వెళుతుందన్నారు. ః హటియా-ఎర్నాకుళం(08645) వారాంతపు ప్రత్యేక రైలు జనవరి 2 నుంచి జనవరి 30 వరకు ప్రతి సోమవారం తెల్లవారుజామున 4.50 గంటలకు హటియాలో బయలుదేరి, అదే రోజు రాత్రి 8.43 గంటలకు దువ్వాడ చేరుకొని, ఇక్కడి నుంచి 8.45 గంటలకు బయలుదేరి వెళుతుందన్నారు.

* ఎర్నాకుళం-హటియా(08646) ప్రత్యేక రైలు జనవరి 5 నుంచి ఫిబ్రవరి 2 వరకు ప్రతి గురువారం ఉదయం 7.15 గంటలకు  ఎర్నాకుళంలో ప్రారంభమై మర్నాడు మధ్యాహ్నం 12.08 గంటలకు దువ్వాడ చేరుకొని, ఇక్కడి నుంచి 12.10 గంటలకు బయలుదేరి వెళుతుందని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని