logo

ఏసీబీ పేరిట సబ్‌ రిజిస్ట్రార్‌కు టోకరా

ఏసీబీ అధికారులమంటూ బెదిరించి రూ.40 వేలు వసూలు చేశారని చోడవరం ఇన్‌ఛార్జి సబ్‌ రిజిస్ట్రారు ఆకెళ్ల సూర్య నర్సింహమూర్తి సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Updated : 01 Feb 2023 05:21 IST

చోడవరం, న్యూస్‌టుడే: ఏసీబీ అధికారులమంటూ బెదిరించి రూ.40 వేలు వసూలు చేశారని చోడవరం ఇన్‌ఛార్జి సబ్‌ రిజిస్ట్రారు ఆకెళ్ల సూర్య నర్సింహమూర్తి సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 27న మధ్యాహ్నం భోజన విరామ సమయంలో 98850 50970 నంబరు నుంచి తాము ఏసీబీ అధికారులమంటూ ఫోన్‌ చేసి సర్వీస్‌ వివరాలు అడిగారన్నారు. లంచం తీసుకుంటున్నట్లు, అక్రమ ఆస్తులు ఉన్నట్లు సమాచారం వచ్చిందన్నారు. ఈ ఆరోపణలు, కేసుల నుంచి విముక్తి కలిగించాలంటే నగదు సెటిల్‌మెంట్‌ చేసుకోవాలని, లేదంటే దాడి చేసి కేసులు పెడతామని బెదిరించారన్నారు. రూ. రెండు లక్షలివ్వాలని డిమాండ్‌ చేశారని, తాను భయాందోళనకు గురై బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.40 వేలను 77804 38432 నంబరుకు గూగుల్‌ పే చేసినట్లు తెలిపారు. తాను కాస్త ఉపశమనం పొందిన తర్వాత సిబ్బందికి ఏసీబీ ఫోన్‌ విషయం తెలియజేయగా.. ట్రూ కాలర్‌ యాప్‌లో పరిశీలించినప్పుడు మోసపోయినట్లు గుర్తించామన్నారు. మళ్లీ కొద్దిసేపటికి కాల్‌ వచ్చిందని, మిగిలిన నగదు గురించి అడగ్గా సిబ్బంది గట్టిగా మాట్లాడటంతో ఫోన్‌ కట్‌ చేశారన్నారు. వెంటనే సైబర్‌ క్రైం స్టేషన్‌కు 1930 కాల్‌ ద్వారా ఫిర్యాదు చేసి, స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు అందజేసినట్లు పేర్కొన్నారు. దీనిపై సీఐ బి.శ్రీనివాసరావు వద్ద ప్రస్తావించగా సబ్‌ రిజిస్ట్రారు ఫిర్యాదు చేశారని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని