logo

అదృశ్యమైన మరో బాలిక సింహాచలంలో గుర్తింపు

అదృశ్యమైన ఇద్దరు విద్యార్థినుల్లో రెండో బాలికను మంగళవారం తెల్లవారుజామున సింహాచలంలో పోలీసులు గుర్తించారు.

Published : 01 Feb 2023 05:24 IST

డాబాగార్డెన్స్‌, న్యూస్‌టుడే: అదృశ్యమైన ఇద్దరు విద్యార్థినుల్లో రెండో బాలికను మంగళవారం తెల్లవారుజామున సింహాచలంలో పోలీసులు గుర్తించారు. జగదాంబకూడలి దరి యల్లమ్మతల్లి ఆలయం ఎదురుగా ఉన్న ఓ ప్రైవేటు స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్న మహారాణిపేటకు చెందిన ఇద్దరు విద్యార్థినులు సోమవారం సాయంత్రం పాఠశాల విడిచిపెట్టిన తరువాత ఇంటికి వెళ్లలేదు. కుటుంబసభ్యులు మహారాణిపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నగరంలోని వివిధ ప్రాంతాల్లో గాలించడం ప్రారంభించారు. ఇద్దరిలో ఒక బాలికను జగదాంబకూడలి వద్ద గుర్తించారు. మరో బాలిక గురించి ప్రశ్నించగా ఇంటికి వెళ్లినట్లు చెప్పింది. అయితే ఆమె ఇంటికి చేరుకోకపోవడంతో సోమవారం రాత్రి 11 గంటల వరకూ బాలికను ప్రశ్నిస్తూనే ఉన్నారు.

సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా..:  పోలీసులు అదుపులో ఉన్న బాలిక ఇచ్చిన సమాచారం మేరకు రెండో బాలిక కూడా క్షేమంగా ఇంటికి చేరుతుందిలే అని అంతా అనుకున్నారు. కాని తెల్లవారైనా ఇంటికి రాలేదు. దీంతో కుటుంబసభ్యుల్లో, పోలీసుల్లో ఆందోళన నెలకొంది. జగదాంబకూడలి వరకు వచ్చిన బాలిక ఇంటికి కాకుండా మరెక్కడికి వెళ్లి ఉంటుందో విచారణ చేపట్టారు. బాలిక తల్లిదండ్రులు, బంధువులు రాత్రంగా వీధుల్లో తిరుగుతూ వెతికారు. బాలిక వద్ద సెల్‌ఫోన్‌ ఉందని తెలుసుకున్న పోలీసులు అర్ధరాత్రి 1 గంటకు మొబైల్‌ సిగ్నల్‌ను వెతికే పనిలో పడ్డారు. సిగ్నల్‌ సింహాచలంలో చూపించడంలో అక్కడికి వెళ్లి గాలించారు. ఎట్టకేలకు అక్కడ ఎదురుపడడంతో స్టేషన్‌కు తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. పోలీసుల విచారణలో బాలికలు సరైన సమాధానాలు చెప్పలేదు. వారు భయందోళనలో ఉండడంతో కుటుంబసభ్యులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని