logo

పేరుకు సేవ.. అరాచకాల తోవ

ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు, ఇతర సేవలు అందించడంలో ఆదర్శంగా నిలవాల్సిన వాలంటీర్లలో కొందరు అక్రమాలకు పాల్పడుతూ మా రూటే సెపరేట్‌ అన్నట్లు వ్యవహరిస్తున్నారు.

Published : 08 Aug 2023 04:53 IST

వాలంటీర్లలో కొందరి రూటే సెపరేటు
పింఛన్ల పంపిణీలో చేతివాటం
కె.కోటపాడు (దేవరాపల్లి), పాడేరు పట్టణం, న్యూస్‌టుడే

ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు, ఇతర సేవలు అందించడంలో ఆదర్శంగా నిలవాల్సిన వాలంటీర్లలో కొందరు అక్రమాలకు పాల్పడుతూ మా రూటే సెపరేట్‌ అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఇలా అడ్డదారులు తొక్కుతున్నా..  సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు.

  • పెందుర్తి మండలం పురుషోత్తపురం సచివాలయంలో వాలంటీరుగా పనిచేస్తున్న రాయవరపు వెంకటేష్‌ గత నెల 30న బంగారం కోసం వృద్ధురాలు కోటగిరి వెంకటలక్ష్మి హత్య చేసిన విషయం తెలిసిందే.
  • పాడేరు మండలంలో గత ఏడాది వాలంటీరు గంజాయితో పట్టుబడ్డాడు. పోలీసులు అతడితో కుమ్మక్కై కేసు నమోదు చేయలేదని ఆరోపణలున్నాయి. కె.కోటపాడు మండలం చౌడువాడ శివారు గరుగుబిల్లికి చెందిన వాలంటీరు రాఘవరాజు చెరువును ఆక్రమించి షెడ్డు నిర్మించగా స్థానికుల ఫిర్యాదుతో రెవెన్యూ అధికారులు దాన్ని తొలగించారు. ఒక గ్రామానికి చెందిన మరో వాలంటీరు భర్త టైరు బండి ద్వారా ఇసుక కావాల్సిన వారికి సరఫరా చేస్తున్నాడు. పింఛన్లు, సంక్షేమ పథకాలకు సంబంధించిన నగదు పంపిణీలో కాసులకు కక్కుర్తిపడిన వాలంటీరును విధుల నుంచి తొలగించిన ఘటన ఇటీవల వెలుగు చూసింది. చౌడువాడకు చెందిన కొందరు వాలంటీర్లు నిబంధనలకు అనుగుణంగా పనిచేయడం లేదని, ప్రొటోకాల్‌ పాటించడం లేదని సర్పంచి దాడి ఎరుకునాయుడు జిల్లాల పునర్విభజనకు ముందు అప్పటి కలెక్టర్‌ మల్లికార్జునకు, పునర్విభజన జరిగిన తర్వాత అనకాపల్లి కలెక్టరు రవికి ఫిర్యాదు చేశారు.


సర్పంచుల పరిధిలోకి తేవాలి

- దాడి ఎరుకునాయుడు, ఉమ్మడి విశాఖ జిల్లా పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడు, చౌడువాడ సర్పంచి

వాలంటీర్లు అక్రమాలకు పాల్పడుతున్నా.. ఒకటో, రెండో వెలుగుచూస్తున్నాయి. చాలా వరకు వైకాపా నాయకుల కారణంగా బయటకురావడం లేదు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు భయపడి అధికారులూ పట్టించుకోవడం లేదు. వాలంటీర్లను సర్పంచుల పరిధిలోకి తీసుకురావాలి. వారిపై పూర్తి ఆజమాయిషీ సర్పంచులకు ఇవ్వాలి. అప్పుడే అవినీతి, అక్రమాలు, ఆగడాలకు అడ్డుకట్ట పడుతుంది. సచివాలయాల పరిధిలోని ప్రజలకు జవాబుదారీగా ఉంటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు