logo

‘భామా కలాపం-2’ నవ్విస్తుంది

‘భామా కలాపం-2’ వెబ్‌సిరీస్‌ తప్పకుండా నవ్విస్తుందని బాలీవుడ్‌ నటి సీరత్‌ కపూర్‌ అన్నారు. వెబ్‌సిరీస్‌ ప్రమోషన్‌లో భాగంగా చిత్ర నటులు ఆదివారం నగరంలోని ఓ హోటల్‌లో విలేకరులతో ముచ్చటించారు.

Published : 05 Feb 2024 05:25 IST

మాట్లాడుతున్న నటి శరణ్య, చిత్రంలో సీరత్‌కపూర్‌

  జగదాంబకూడలి, న్యూస్‌టుడే: ‘భామా కలాపం-2’ వెబ్‌సిరీస్‌ తప్పకుండా నవ్విస్తుందని బాలీవుడ్‌ నటి సీరత్‌ కపూర్‌ అన్నారు. వెబ్‌సిరీస్‌ ప్రమోషన్‌లో భాగంగా చిత్ర నటులు ఆదివారం నగరంలోని ఓ హోటల్‌లో విలేకరులతో ముచ్చటించారు. సీరత్‌ కపూర్‌ మాట్లాడుతూ సీనియర్‌ కథానాయిక ప్రియమణి ప్రధానపాత్ర పోషించిన ‘భామా కలాపం-1’ వెబ్‌సిరీస్‌కు సీక్వెల్‌గా భామా కలాపం-2 వస్తోందన్నారు. ఈ చిత్రంలో తనపాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలిస్తుందన్నారు. నటి శరణ్య మాట్లాడుతూ ప్రియమణి, తనకు మధ్య వచ్చే పలు సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయన్నారు. ఈనెల 16న ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తుందని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని