logo

విశాఖలో ధోనీ ఆటకు అభిమానుల ఫిదా

ధనాధన్‌ ధోనీ రాకతో విశాఖ అభిమానులు ఫిదా అయ్యారు. ఆదివారం రాత్రి వైఎస్‌ఆర్‌ ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో దిల్లీ క్యాపిటల్స్‌- చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ జట్టు 20 పరుగుల తేడాతో చెన్నై జట్టుపై విజయం సాధించింది.

Updated : 01 Apr 2024 07:22 IST

న్యూస్‌టుడే, విశాఖ క్రీడలు

బ్యాటింగ్‌ చేస్తున్న ధోనీ

ధనాధన్‌ ధోనీ రాకతో విశాఖ అభిమానులు ఫిదా అయ్యారు. ఆదివారం రాత్రి వైఎస్‌ఆర్‌ ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో దిల్లీ క్యాపిటల్స్‌- చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ జట్టు 20 పరుగుల తేడాతో చెన్నై జట్టుపై విజయం సాధించింది. రెండో బ్యాటింగ్‌కు దిగిన చెన్నై జట్టులో ధోనీ ఎప్పుడొస్తాడా అంటూ అభిమానులు ఉత్కంఠతో ఎదురు చూశారు. ఆ జట్టు అయిదు వికెట్లు పడగానే ధోనీ క్రీజ్‌లోకి వస్తుండడంతో ఒక్కసారిగా స్టేడియంలోని గ్యాలరీలన్నింటిలోను అభిమానులు లేచి నిలబడి వారి సెల్‌ఫోన్‌లలో టార్చ్‌లైట్లు వేస్తూ ధోనీ .. ధోనీ అంటూ స్వాగతం పలికారు. స్టేడియం అంతా కరతాళ ధ్వనులతో హోరెత్తింది. దిల్లీ క్యాపిటల్‌ జట్టు విజయం సాధించినప్పటికీ అభిమానులు మాత్రం ధోనీ ఆటకు ఫిదా అయ్యారు.

చెన్నై జట్టు క్రీడాకారులు

స్టేడియం బయట ధోనీపై తమ అభిమానాన్ని చాటుతూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్న యువత

గెలిచిన ఆనందంలో దిల్లీ క్యాపిటల్స్‌ జట్టు


ఐపీఎల్‌ మ్యాచ్‌ పదనిసలు

ఛీర్‌గాల్స్‌ సందడి

విశాఖ క్రీడలు, న్యూస్‌టుడే: దిల్లీ క్యాపిటల్స్‌ జట్టు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది.

  • స్టేడియంలోని గ్యాలరీల్లో సీట్లు రాత్రి ఏడుగంటలకే దాదాపు ఎనభైశాతం వరకు నిండిపోగా 7.30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభమయ్యే సమయానికి దాదాపు గ్యాలరీలన్నీ నిండిపోయాయి.
  • స్టేడియంలో చీర్‌గాల్స్‌ తమ జట్ల జెండాలు పట్టుకుని అభిమానులను ఉత్సాహపరిచారు.
  • మూడో ఓవర్‌లో దీపక్‌చాహర్‌ వేసిన తొలిబంతికే డేవిడ్‌ వార్నర్‌ అద్భుతమైన సిక్సర్‌ కొట్టడంతో స్టేడియంలో అభిమానులు కేరింతలు కొట్టారు.
  • స్టేడియంలో చెన్నై జట్టు క్రీడాకారుల జెర్సీలతో పసుపుమయంగా మారింది.
  • డేవిడ్‌ వార్నర్‌ సిక్సర్‌ కొట్టడంతో పిచ్‌కు ఇరువైపులా ఉండే వికెట్లు నీలం, ఎరుపు రంగులు విరజిమ్మాయి. అలా మూడుసార్లు రంగులు ఆగి వెలగడంతో అభిమానులు కొత్త అనుభూతిని పొందారు.
  • దీపక్‌చాహర్‌ మరో ఓవర్‌లో డేవిడ్‌ వార్నర్‌ వరుసగా ఒక సిక్సర్‌, రెండు బౌండరీలు కొట్టడంతో వార్నర్‌ వార్నింగ్‌ అంటూ స్టేడియంలో స్కోర్‌బోర్డు మీద రావడంతో అభిమానులు ఔనా అంటూ బోర్డువైపు చూశారు.
  • రాత్రి 9 గంటలకు అన్ని గ్యాలరీల్లో నుంచి అభిమానులు సెల్‌ఫోన్‌లతో టార్చ్‌లైట్‌ వేసి ధోనీ.. ధోనీ అంటూ నినాదాలు చేశారు.
  • రెండో బ్యాటింగ్‌కు దిగిన చెన్నై జట్టు క్రీడాకారుల బ్యాటింగ్‌ను చూసేందుకు స్టేడియం బయట ఉన్న అభిమానులు ఒక్కసారిగా గేటు నెంబరు పది వద్దకు వచ్చి లోపలకు చొచ్చుకొని వచ్చారు. పక్కనే ఉన్న ఆలయం గోడ ఎక్కి స్టేడియంలోకి ప్రవేశించారు. నిర్వాహకులు వారిని బయటకు పంపివేశారు.

దిల్లీ క్యాపిటల్స్‌ జట్టు అభిమానులు

యువతుల ఉత్సాహం

52 పరుగులు చేసిన డేవిడ్‌ వార్నర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు