logo

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థుల మృతి

కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు ఇంజినీరింగ్‌ యువకులు ప్రాణాలు కోల్పోయారు.

Published : 19 Apr 2024 04:29 IST

బర్రే మాధవ్‌ (పాతచిత్రం)

పెద్దాపురం, న్యూస్‌టుడే: కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు ఇంజినీరింగ్‌ యువకులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఒకరు విశాఖ నగరానికి చెందిన విద్యార్థి. పెద్దాపురం పోలీసులు అందించిన సమాచారం ప్రకారం.. గండేపల్లి మండలం సూరంపాలెంలోని ఒక ఇంజినీరింగ్‌ కళాశాలలో విశాఖపట్నంలోని ద్వారం వారి వీధికి చెందిన బర్రే మాధవ్‌(20), అనకాపల్లి జిల్లాకు చెందిన లాలం సతీష్‌ (20), శ్రీకాకుళం జిల్లాకు చెందిన నక్కా రామచంద్రరావు ఇంజినీరింగ్‌ చదువుతున్నారు. గండేపల్లి మండలం రామేశంపేటలో గది అద్దెకు తీసుకొని నివాసం ఉంటున్నారు. సరకుల కొనుగోలు నిమిత్తం ముగ్గురు యువకులు గురువారం రాత్రి పెద్దాపురానికి ద్విచక్రవాహనంపై వెళ్లారు. తిరిగి రామేశంపేటకు వస్తుండగా.. ఎస్పీపీసీ ప్రైవేటు గోడౌన్‌ వద్ద  రాజమహేంద్రవరం వైపు నుంచి వచ్చిన గుర్తుతెలియని వాహనం ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. దీంతో బర్రే మాధవ్‌, లాలం సతీష్‌ అక్కడికక్కడే దుర్మరణం చెందారు.బీ విశాఖపట్నంలోని ద్వారం వారి వీధికి చెందిన బర్రే అజయ్‌కుమార్‌, బర్రే కుమారి దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతి చెందిన బర్రే మాధవ్‌ పెద్దవాడు. అజయ్‌కుమార్‌ గుజరాత్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నారు. గురువారమే విశాఖపట్నం నుంచి గుజరాత్‌కి వెళ్లాడు. మాధవ్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో ద్వితీయ సంవత్సరం మెకానికల్‌ చదువుతున్నాడు. చదువుకు పూర్తిచేసుకొని కొలువులో చేరుదామని యోచిస్తుండగా.. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని