logo

జబర్దస్త్‌ నటులకు సత్కారం

జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణకు మద్దతుగా జబర్దస్త్‌ నటులు ఆటో రాంప్రసాద్‌, గెటప్‌ శ్రీను అనకాపల్లి నియోజకవర్గంలో రెండు రోజులపాటు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Published : 20 Apr 2024 03:20 IST

లక్ష్మీదేవిపేట (అనకాపల్లి), న్యూస్‌టుడే: జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణకు మద్దతుగా జబర్దస్త్‌ నటులు ఆటో రాంప్రసాద్‌, గెటప్‌ శ్రీను అనకాపల్లి నియోజకవర్గంలో రెండు రోజులపాటు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గాజు గ్లాసు, కమలం గుర్తులపై ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా కొణతాల రామకృష్ణను, ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేశ్‌లను గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. వీరిని జనసేన కార్యాలయంలో కొణతాల రామకృష్ణ, తెదేపా మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్‌ సత్యనారాయణ సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని