WhatsApp: వాట్సప్‌లో కొత్త ఫీచర్‌.. ఇకపై ఈవెంట్‌ ప్లాన్‌ చేయొచ్చు!

WhatsApp: ఇకపై వాట్సప్‌లో ఈవెంట్‌ ప్లాన్‌ చేయొచ్చు. ఎవరెవరు వస్తారో కూడా తెలుసుకోవచ్చు. వారికి నోటిఫికేషన్‌ ద్వారా గుర్తు చేయొచ్చు. అందుకు అనుగుణంగా కమ్యూనిటీలో  ఈవెంట్స్‌ అనే కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది వాట్సప్‌.

Updated : 02 May 2024 14:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వాట్సప్‌ కమ్యూనిటీ కొత్త సదుపాయం అందుబాటులోకి వచ్చింది. గ్రూప్ మెసేజ్‌లలో ఈవెంట్‌లను ప్లాన్ చేయడానికి, నిర్వహించడానికి వాట్సప్‌ (WhatsApp) కొత్త మార్గాన్ని తీసుకొచ్చింది. తద్వారా స్నేహితులు, స్కూళ్లు, సన్నిహితులతో వర్చువల్, వ్యక్తిగత సమావేశాలను సెటప్ చేయడాన్ని మరింత సులభతరం చేస్తోంది.

ఇ-మెయిల్ ద్వారా ఆహ్వానాలను పంపే వివిధ ‘ఇ-వైట్’ సేవల్లాగే కొత్త ‘ఈవెంట్స్‌’ ఫీచర్ పనిచేస్తుంది. గ్రూప్ సభ్యుల పుట్టినరోజు పార్టీలు, వర్క్ మీటింగ్‌లను సెటప్ చేయడానికి ఇది అనుమతిస్తుంది. కొత్త ఈవెంట్‌.. గ్రూప్‌ ఇన్ఫర్మేషన్‌ పేజీకి పిన్ అయ్యి ఉంటుంది. గ్రూప్ చాట్ థ్రెడ్‌ క్రియేట్‌ అవుతుంది. తద్వారా ఎవరెవరికీ మెసేజ్‌ చేరిందో తెలుసుకోవచ్చు. అలాగే ఈవెంట్‌కు వచ్చేవారు రిప్లయ్‌ ఇచ్చి కన్ఫర్మ్‌ చేయొచ్చు. వారికి ఈవెంట్‌ సమయానికి నోటిఫికేషన్‌ కూడా వెళుతుంది. ఈ ఫీచర్‌ను తొలుత వాట్సప్‌ కమ్యూనిటీలో (WhatsApp Community) తీసుకొస్తున్నారు. వచ్చే కొన్ని నెలల్లో వాట్సప్‌ గ్రూప్‌లకూ యాడ్‌ చేయనున్నారు.

అనౌన్స్‌మెంట్ గ్రూప్‌లకు రిప్లయ్‌ ఇచ్చే మరో ఫీచర్‌ను కూడా వాట్సప్ జోడించింది. ఫలితంగా అడ్మిన్ సందేశంపై కామెంట్స్‌తో పాటు ఫీడ్‌బ్యాక్‌ను పంపొచ్చు. యూజర్ల పనికి అంతరాయం కలిగించకుండా మ్యూట్‌ ఆప్షన్‌ ఉంటుంది. అలాగే నోటిఫికేషన్‌ బార్‌లోనే రిప్లయ్‌ ఇచ్చే ఫీచర్‌ కూడా ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని