logo

జనంలో అయ్యన్న సంతకం.. అట్టహాసంగా నామినేషన్‌

కార్యకర్తల కోలాహలం నడుమ కూటమి అభ్యర్థిగా మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు శుక్రవారం నామినేషన్‌ వేశారు.

Published : 20 Apr 2024 03:26 IST

నర్సీపట్నం అర్బన్‌, న్యూస్‌టుడే: కార్యకర్తల కోలాహలం నడుమ కూటమి అభ్యర్థిగా మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు శుక్రవారం నామినేషన్‌ వేశారు. అంతకుముందు తెదేపా, భాజపా, జనసేన కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో ప్రచార వాహనం మీదే నామినేషన్‌ పత్రాలపై సంతకం చేశారు. మనుమరాలు నిషిత, సతీమణి పద్మావతి ఎదురు రాగా ఉదయం 9 గంటల సమయంలో ర్యాలీగా బయల్దేరారు. ఐదు రోడ్ల కూడలిలోని బాల వినాయకుడి ఆలయంలో పూజలు చేశారు. అక్కడి నుంచి కృష్ణాబజారు, అబీద్‌కూడలి మీదుగా పాల్ఘాట్‌ కూడలికి చేరుకున్నారు.

అనకాపల్లి లోక్‌సభ కూటమి అభ్యర్థి సీఎం రమేశ్‌ కార్యకర్తలతో కలిసి ర్యాలీలో నడిచారు. కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ.. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కూటమి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నాశనమయ్యాయని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యేలు పప్పల చలపతిరావు, బోళెం ముత్యాలపాప, తెదేపా జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు, జడ్పీటీసీ సభ్యురాలు సుకల రమణమ్మ, అయ్యన్న కుమారుడు విజయ్‌, నాయకులు ఎంవీవీ ప్రసాద్‌, బోళెం వెంకటరమణమూర్తి, రామప్రసాద్‌, భాజపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి సారథి, ఎర్రంనాయుడు, జనసేన నాయకులు సూర్యచంద్ర, అద్దేపల్లి గణేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని