logo

ఉపాధి నిధులు మింగేస్తున్నారు..

కేంద్ర ప్రభుత్వం అందించే ఉపాధి నిధులను వైకాపా నాయకులు స్వాహా చేస్తున్నారని అనకాపల్లి ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌ ఆరోపించారు. అచ్యుతాపురం మండలం లంకధర్మవరం, మడుతూరు గ్రామాల్లో ఉపాధి కూలీలతో ఆయన మంగళవారం మాట్లాడారు.

Published : 01 May 2024 03:16 IST

వైకాపా నాయకులపై సీఎం రమేశ్‌ ధ్వజం

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం అందించే ఉపాధి నిధులను వైకాపా నాయకులు స్వాహా చేస్తున్నారని అనకాపల్లి ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌ ఆరోపించారు. అచ్యుతాపురం మండలం లంకధర్మవరం, మడుతూరు గ్రామాల్లో ఉపాధి కూలీలతో ఆయన మంగళవారం మాట్లాడారు. పేదలకు మోదీ ప్రభుత్వం ఉచితంగా బియ్యం అందిస్తున్నా, దీనిని వైకాపా నాయకులే తామే ఇచ్చినట్లు చెప్పుకొంటున్నారన్నారు. పేదల ఇంటికి మోదీ ప్రభుత్వం రూ. 1.80 లక్షల చొప్పున ఇంటికి అందివ్వగా జగన్‌ చిల్లిగవ్వ ఇవ్వడం లేదన్నారు. కేంద్రంతో సమానంగా వైకాపా ప్రభుత్వం మరో రూ. 1.50 లక్షలు అందిస్తే పేదలు అప్పులుచేయకుండా సొంతింటికలను నెరవేర్చుకునే అవకాశం ఉండేదన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం నిధులను స్వాహా చేసి కూలీలకు టెంట్లు, మజ్జిగ, వేసవి అలవెన్సులు అందకుండా జగన్‌ ప్రభుత్వం చేస్తోందన్నారు. కంపెనీల్లో ఉపాధిలేక ఎండల్లో నిర్వాసితులు, స్థానికులు కూలీపని చేసుకోవడంపై  ఆయన విచారం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రమణమూర్తిరాజు కంపెనీల నుంచి దోచుకోవడం తప్ప స్థానిక యువతకు ఉపాధి కల్పనపై దృష్టిపెట్టలేదన్నారు. సర్వేనెంబర్‌ 1లో జరిగిన భూఅవకతవకలు అధికారంలోకి వచ్చిన వెంటనే వెలికి తీస్తామన్నారు. అక్రమాలకు పాల్పడిన అధికారులు, కబ్జాదారులపైనా చర్యలు ఉంటాయన్నారు. సెజ్‌కు భూములు ఇచ్చిన రైతులను ఉపాధి కూలీలుగా మార్చేన ఘనత ఎమ్మెల్యే కన్నబాబుకి, సీఎం జగన్‌కు దక్కుతుందని జనసేన అభ్యర్థి సుందరపు విజయ్‌కుమార్‌, తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి ప్రగడ నాగేశ్వరరావు మండిపడ్డారు. వెదురువాడ పంచాయతీలో ఇద్దరు రాజులు కలిసి చేసిన భూవ్యాపారంతో అన్నదాతలు భూములు కోల్పోయి కూలీలుగా మారిపోయారన్నారు. వచ్చే ఎన్నికల్లో వైకాపాను చిత్తుగా ఓడించి కమలం, గ్లాస్‌ గుర్తులపై ఓట్లు వేసి గెలిపించి అభివృద్ధికి బాటలు వేయాలని కోరారు. జడ్పీ మాజీ ఛైర్‌పర్సన్‌ లాలం భవానీ, భాజపా నియోజకవర్గ కన్వీనర్‌ రాజాన సన్యాసినాయుడు, నాయకులు బైలపూడి రాందాసు, నీరుకొండ నర్సింగరావు, మోటూరు శ్రీవేణి, జనపరెడ్డి శ్రీనివాసరావు, మేరుగు బాపునాయుడు, డ్రీమ్స్‌ నాయుడు, మార్లపల్లి సుజాత, శరగడం నాగార్జున, శనివాడ ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని