logo

అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌

జిల్లాలోని అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో వందశాతం వెబ్‌కాస్టింగ్‌ నిర్వహిస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రవి పేర్కొన్నారు. కలెక్టరేట్లో మంగళవారం పార్టీల ఏజెంట్లతో సమావేశం నిర్వహించారు.

Published : 08 May 2024 03:37 IST

కలెక్టరేట్, న్యూస్‌టుడే: జిల్లాలోని అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో వందశాతం వెబ్‌కాస్టింగ్‌ నిర్వహిస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రవి పేర్కొన్నారు. కలెక్టరేట్లో మంగళవారం పార్టీల ఏజెంట్లతో సమావేశం నిర్వహించారు. పెందుర్తితో కలిపి పార్లమెంట్ నియోజకవర్గంలో 15,96,916 మంది ఓటర్లు ఉన్నారన్నారు. 4449 మంది సర్వీసు ఓటర్లు ఉన్నారన్నారు. 1828 పోలింగ్‌ కేంద్రాలు సిద్ధం చేశామన్నారు. 1859 ప్రిసైడింగ్‌ అధికారులు, 1927 సహాయ ప్రిసైడింగ్‌ అధికారులు, 7480 మంది పోలింగ్‌ అధికారులు ఉన్నారన్నారు. 380 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించామన్నారు. 85 ఏళ్లు పైబడిన వారితోపాటు దివ్యాంగులు 1000 మంది హోం ఓటింగ్‌కు ఫారం-12డి తీసుకోగా 880 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారన్నారు. అత్యవసర సేవలకు సంబంధించి 1340 మందికి పోస్టల్‌ బ్యాలెట్ ఇవ్వగా 341 మంది ఓటు వేసి తిరిగి పంపించారన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న 11,518 మంది పోస్టల్‌ బ్యాలెట్ తీసుకోగా 6వ తేదీ నాటికి 5126 మంది ఓటు వేశారన్నారు. పార్లమెంట్కు పోటీ చేసే అభ్యర్థులు అందరూ బూత్‌ ఏజెంట్లను నియమించాలన్నారు. డీఆర్వో బి.దయానిధి, నోడల్‌ అధికారులు, అభ్యర్థుల ఏజెంట్లు పాల్గొన్నారు.

ఓటర్లకు పూర్తి స్థాయిలో సదుపాయాలు

కలెక్టరేట్, న్యూస్‌టుడే: జిల్లాలో ఉన్న పోలింగ్‌ కేంద్రాల్లో పూర్తి సౌకర్యాలు కల్పించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రవి నోడల్‌ అధికారులను ఆదేశించారు. సన్నద్ధతపై మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో అవసరమైన కుర్చీలు, బల్లలు, విద్యుత్తు, తాగునీరు, ర్యాంపులు, మూడుచక్రాల కుర్చీలు, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలు ఉండాలన్నారు. ఎండవేడిమి తట్టుకోవడానికి వీలుగా టెంట్లు వేయించాలన్నారు. పోలింగ్‌ సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వసతి, అల్పాహారం, టీ, భోజన సదుపాయాలు కల్పించాలని సూచించారు. పోలింగ్‌ ప్రారంభం నుంచి పూర్తైన వరకు ఎలాంటి ఇబ్బందులు రానివ్వకూడదని, ఇతరుల జోక్యం ఉండకూడదని ఆదేశించారు. జిల్లాలోని 340 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. డీఆర్వో బి.దయానిధి, నోడల్‌ అధికారులు సుబ్బలక్ష్మీ, రమామణి, మంజులవాణి, హేమంత్‌, రామారావు, శచీదేవి, మూర్తి, లక్ష్మీ, శిరీషారాణి, ప్రసాద్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు