గాజువాకలో జగన్ ప్రచార సభ
ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం సాయంత్రం గాజువాక కూడలిలో నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సభ పేలవంగా సాగింది.
ప్రజా స్పందన లేక వెలవెల
సీఎం ప్రసంగం సాగుతుండగానే వెళ్లిపోతున్న జనం
గాజువాక, న్యూస్‌టుడే : ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం సాయంత్రం గాజువాక కూడలిలో నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సభ పేలవంగా సాగింది. అన్ని వార్డుల నుంచి ప్రజల్ని ఆటోల్లో తీసుకురావడానికి వార్డు కమిటీల కార్యకర్తలు ఆపసోపాలు పడ్డారు. కాలనీల్లో ఒక్కొక్కరికీ రూ.300 ఇచ్చి, ఆటోకు రూ.800 చొప్పున చెల్లించి జనసమీకరణ చేసినట్లు చర్చసాగింది. ఆటోలన్నీ మధ్యాహ్నం 3 గంటలకే లంకా మైదానంలోకి చేరుకునేలా ఏర్పాటు చేశారు. సీఎం జగన్ ప్రసంగిస్తున్న సమయంలోనే మహిళలు వెనుదిరిగి, గుంపులుగా ఆటోల వద్దకు చేరుకున్నారు. ఎవరూ వెళ్లొదని నాయకులు వారించినా వినలేదు.
సీఎం వచ్చే మార్గంలో రాకపోకలు నిలిపివేయడంతో ఇలా..
ట్రాఫిక్ ఇక్కట్లు: గాజువాక కూడలి మొత్తం పోలీసుల బందోబస్తుతో నిండిపోవడంతో ట్రాఫిక్ స్తంభించింది. కూర్మన్నపాలెం, కొత్తగాజువాక వైపు వెళ్లాల్సిన వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. జాతీయ రహదారిపై షీలానగర్ నుంచి కూర్మన్నపాలెం వరకు వాహనాలు నిలిచిపోయాయి. కొన్ని వాహనాలు ఆటోనగర్ మీదుగా వెళ్లాయి. వివిధ పరిశ్రమల నుంచి ఇళ్లకు వెళ్లాల్సిన కార్మికులు, దూర ప్రాంత ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. 3 గంటల నుంచే ప్రధాన రహదారుల్లో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ ఎన్నికల్లో విజయంపై రూ.1.75 కోట్ల పందెం
[ 19-05-2024]
ఓటర్ల తీర్పు ఈవీఎంల్లో నిక్షిప్తమై ఉండగా గెలుపుపై నేతలు ఆశల పల్లకీలో ఊరేగుతున్నారు. -
కాంబోడియాలో విశాఖ యువత నరకయాతన
[ 19-05-2024]
ఉద్యోగం సంపాదించాలి...కుటుంబాన్ని పోషించాలి అనే ఒకే ఒక్క ఆశతో ‘ఏజెంట్ల’ను నమ్మిన యువకులు సైబర్‌నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నారు. -
చిరంజీవిని కలిసిన గంటా
[ 19-05-2024]
భీమిలి అసెంబ్లీ అభ్యర్థి, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు శనివారం హైదరాబాద్‌లో సినీ నటులు, మెగాస్టార్ చిరంజీవిని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. -
ఎన్నికల విధుల్లో.. ఎన్ని బాధలో!!
[ 19-05-2024]
సార్వత్రిక ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి తగిన సౌకర్యాలు కల్పించడంలో యంత్రాంగం ఘోరంగా విఫలమైంది. -
కీలక పోరు.. ఓటర్ల జోరు
[ 19-05-2024]
విశాఖ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో 2019 ఎన్నికలతో పోల్చితే పోలింగ్ శాతం బాగానే పెరిగింది. -
ఎన్నికల ఖర్చులకు రూ.12 కోట్లు విడుదల
[ 19-05-2024]
జిల్లాలోని ఏడు అసెంబ్లీ, ఒక లోక్‌సభ స్థానానికి నిర్వహించిన ఎన్నికల ఖర్చు కోసం రాష్ట్ర ప్రభుత్వం తొలి విడతగా రూ.12 కోట్లు విడుదల చేసింది. -
పోలింగులో యువ వెల్లువ
[ 19-05-2024]
ఎన్నికల్లో యువత తమ ఓటు హక్కును వినియోగించుకోడానికి వెల్లువలా తరలివచ్చారు. -
ఓట్ల గణనకు 14 టేబుళ్లు.. 800మందికి పైగా సిబ్బంది
[ 19-05-2024]
జిల్లాలో ఆరు నియోజకవర్గాల్లో పోలైన ఓట్లు లెక్కింపునకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. -
‘అందరి సహకారంతో చందనోత్సవం విజయవంతం’
[ 19-05-2024]
సింహాచలం దేవస్థానం తొలిసారిగా ప్రవేశపెట్టిన విద్యుత్తు బస్సును అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు శనివారం ప్రారంభించారు. -
తెలంగాణ ఎప్‌సెట్ ఫలితాల్లో సత్తా
[ 19-05-2024]
తెలంగాణ రాష్ట్ర ఎప్‌సెట్ ఫలితాలలో నగరానికి చెందిన విద్యార్థులు ప్రతిభ చూపారు. -
పట్టభద్రుల నెత్తిన మట్టితట్టలు
[ 19-05-2024]
ఏటా డిగ్రీ, బీటెక్‌లు పూర్తిచేసి కళాశాలల నుంచి బయటకు వస్తున్న పట్టభద్రులు వేల సంఖ్యలో ఉంటున్నారు. వీరికి గత అయిదేళ్లలో ఎలాంటి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు చూపలేకపోయారు. -
వేసవి శిక్షణ ఇంతేసంగతులా?
[ 19-05-2024]
ఈ ఏడాది వేసవి క్రీడా శిక్షణ తరగతులు లేనట్లేనని క్రీడా శాఖ ఉన్నతాధికారులు తేల్చేశారు. -
ప్రయాణికుల రద్దీతో ప్రత్యేక రైళ్లు
[ 19-05-2024]
వేసవి సెలవులతో ప్రయాణికుల రద్దీ పెరుగుతుండటంతో వేసవి ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఏకే త్రిపాఠి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
పీర్జాదిగూడ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్‌నకు కాంగ్రెస్ యత్నం: హరీశ్‌రావు
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
బహిరంగ సభ మధ్యలోనే వెనుదిరిగిన రాహుల్.. కారణమిదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
నిలిచిపోయిన కాగజ్‌నగర్, నవజీవన్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు .. ప్రయాణికుల ఆందోళన
-
భార్య, కుమారుడు వేధిస్తున్నారు, భరణం ఇప్పించండి - మాజీ మంత్రి వేడుకోలు