logo
Updated : 01/12/2021 16:21 IST

‘వైకాపా తీరు సరికాదు’

బలిజిపేట: వైకాపా అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల వల్ల ప్రజలు విసుగు చెందుతున్నారని అరకు పార్లమెంటు తెదేపా కార్యదర్శి ఎం.అప్పారావు అన్నారు. బలిజిపేటలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు శాశ్వత గృహాలకు పత్రాలిస్తామంటూ రూ.10వేలు కట్టించుకునేందుకు ఒత్తిడి తీసుకురావడం అన్యాయమన్నారు. ఈ డబ్బులు చెల్లించకపోతే సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని వాలంటీర్లతో పింఛనుదారులను భయపెట్టించడం దారుణమన్నారు. కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర నాయకులు ఎం.పెదపాపినాయుడు, మండల నాయకులు వి.రామకృష్ణ, ఎం.మనోహర్‌రావు, గణపతి పాల్గొన్నారు. 

Read latest Vizianagaram News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని