logo

డిమాండున్న పంటల సాగును ప్రోత్సహించండి

పంటలకు గిట్టుబాటు ధర లభించేలా సహకారం అందించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్‌ అరుణ్‌కుమార్‌ ఆదేశించారు.

Published : 03 Jun 2023 03:39 IST

విజయనగరం అర్బన్‌, న్యూస్‌టుడే: పంటలకు గిట్టుబాటు ధర లభించేలా సహకారం అందించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్‌ అరుణ్‌కుమార్‌ ఆదేశించారు. జిల్లాలో పర్యటించిన ఆయన శుక్రవారం సంయుక్త కలెక్టర్‌ ఛాంబర్లో అధికారులతో సమావేశమయ్యారు. ప్రజలు ఎక్కువగా వినియోగించే, మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న ఆహార పంటలనే పండించేలా రైతులను ప్రోత్సహించాలని సూచించారు. సాగు, విత్తనాల సరఫరా, ధాన్యం కొనుగోలు, బిల్లుల చెల్లింపు, బీమా పరిహారం అందజేత తదితర అంశాలపై చర్చించారు. గత సీజన్‌లో జరిగిన ధాన్యం కొనుగోలు ప్రక్రియకు సంబంధించిన రవాణా భత్యం బిల్లులను త్వరితగతిన చెల్లించాలని పౌర సరఫరాల శాఖ డీఎం మీనాకుమారిని ఆదేశించారు. ఎండీయూ వాహన చోదకులకు ప్రమాద బీమా వర్తించేలా చర్యలు తీసుకోవాలని, ఇప్పటికే ఎవరైనా మరణించి ఉంటే వివరాలు పంపించాలన్నారు. సంయుక్త కలెక్టర్‌ కె.మయూర్‌ అశోక్‌, వ్యవసాయ అధికారి రామారావు, పౌర సరఫరాల అధికారి మధుసూదనరావు, సహకార అధికారి రమేష్‌, వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని