logo

ముగిసిన నామినేషన్ల స్వీకరణ

నామినేషన్ల స్వీకరణ గురువారం ముగిసింది. ఈనెల 16న ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటి వరకు ఏడు శాసనససభ స్థానాలకు 105 మంది 184, విజయనగరం పార్లమెంటుకు 18 మంది 30 సెట్లు సమర్పించారు.

Published : 26 Apr 2024 03:49 IST

ఏడు నియోజకవర్గాల్లో 184 దాఖలు
విజయనగరం పార్లమెంటుకు 30
నేడు పరిశీలన

రిటర్నింగ్‌ అధికారి నాగలక్ష్మికి నామినేషన్‌ పత్రాన్ని అందజేస్తున్న ఎంపీ అభ్యర్థి అప్పలనాయుడు

ఈనాడు, విజయనగరం, విజయనగరం అర్బన్‌ న్యూస్‌టుడే, : నామినేషన్ల స్వీకరణ గురువారం ముగిసింది. ఈనెల 16న ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటి వరకు ఏడు శాసనససభ స్థానాలకు 105 మంది 184, విజయనగరం పార్లమెంటుకు 18 మంది 30 సెట్లు సమర్పించారు. వీటన్నింటినీ శుక్రవారం పరిశీలించనున్నారు. పత్రాలు సక్రమంగా సమర్పించని, వివరాలు నమోదు చేయని వారివి తిరస్కరిస్తారు. పరిశీలనకు అభ్యర్థి, ఎన్నికల ఏజెంటు, ప్రతిపాదకుడు, మరొకరితో కలిపి మొత్తం నలుగురిని అనుమతిస్తారు. 29న మధ్యాహ్నం 3 గంటలు ఉపసంహరణకు గడువు విధించారు. అదే రోజు తుది జాబితా ప్రకటిస్తారు.

రూ.4.43 కోట్ల నగదు, మద్యం సీజ్‌

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో సుమారు రూ.4.43 కోట్ల విలువైన నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, విలువైన లోహ పరికరాలు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నామని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారిణి నాగలక్ష్మి గురువారం తెలిపారు. రూ.1.04 కోట్ల నగదు, 14,372 లీటర్ల మద్యం, రూ.29.75 లక్షల విలువైన మాదకద్రవ్యాలు, రూ.1.85 కోట్ల విలువైన లోహ ఆభరణాలు సీజ్‌ చేశామని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని