logo

కళాకారుల అరెస్టు

ముఖ్యమంత్రి కేసీఆర్‌ను, ప్రభుత్వ పథకాలను కించపరిచేలా ప్రదర్శించిన నాటకంలో నటించిన ఇద్దరు కళాకారులను నగరంలోని హయత్‌నగర్‌ పోలీసులు మంగళవారం అరెస్టు

Published : 29 Jun 2022 03:17 IST

హయత్‌నగర్‌, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి కేసీఆర్‌ను, ప్రభుత్వ పథకాలను కించపరిచేలా ప్రదర్శించిన నాటకంలో నటించిన ఇద్దరు కళాకారులను నగరంలోని హయత్‌నగర్‌ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. సూర్యాపేట జిల్లా, నూతనకల్‌ మండలం, మిర్యాల గ్రామానికి చెందిన కొమ్ము శ్రీరాములు, వరంగల్‌ జిల్లా ఖిలా వరంగల్‌ మండల పరిధిలోని దూపకుంటకు చెందిన బరుపట్ల రాజు(అలియాస్‌ రవి) జూన్‌ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని భాజపా ఆధ్వర్యంలో నిర్వహించిన నాటకంలో సీఎంను కించపరిచేలా వేషధారణలో నటించారు. దీనిపై నమోదైన కేసులో ఇప్పటికే పార్టీ నేత జిట్టా బాలకృష్ణారెడ్డిని అరెస్టు చేయగా తాజాగా నాటకంలో కీలక పాత్రధారులైన శ్రీరాములు, రవిని వారి స్వగ్రామాల్లో అదుపులోకి తీసుకున్నారు. న్యాయస్థానంలో హాజరుపరుచగా ఇద్దరికి రిమాండ్‌ విధించినట్లు హయత్‌నగర్‌ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని