logo

ఆమోదం 73 మంది.. తిరస్కరణ 15 మంది..

లోక్‌సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామపత్రాల పరిశీలన పూర్తయింది. వరంగల్‌ (ఎస్సీ), మహబూబాబాద్‌ (ఎస్టీ) స్థానాలకు జాతీయ, ప్రాంతీయ, గుర్తింపు పొందిన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు 88 మంది 145 సెట్ల నామపత్రాలు సమర్పించారు.

Published : 27 Apr 2024 03:18 IST

వరంగల్‌లోనే అభ్యర్థులు ఎక్కువ
పూర్తయిన నామపత్రాల పరిశీలన

ఈనాడు, మహబూబాబాద్‌, న్యూస్‌టుడే, మహబూబాబాద్‌, వరంగల్‌ కలెక్టరేట్‌: లోక్‌సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామపత్రాల పరిశీలన పూర్తయింది. వరంగల్‌ (ఎస్సీ), మహబూబాబాద్‌ (ఎస్టీ) స్థానాలకు జాతీయ, ప్రాంతీయ, గుర్తింపు పొందిన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు 88 మంది 145 సెట్ల నామపత్రాలు సమర్పించారు. శుక్రవారం అభ్యర్థుల ప్రతినిధుల సమక్షంలో వరంగల్‌, మహబూబాబాద్‌ రిటర్నింగ్‌ అధికారులు ప్రావీణ్య, అద్వైత్‌ కుమార్‌ సింగ్‌ తమ కార్యాలయాల్లో నామపత్రాలను పరిశీలించారు. నామపత్రాలు, వారు జత చేసిన ధ్రువీకరణ పత్రాలు, అఫిడవిట్స్‌, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు జారీ చేసిన ఫారం-ఎ, ఫారం-బిలను ఒకటికి రెండు సార్లు సరిచూశారు. నిబంధనల ప్రకారం లేని 15 మంది అభ్యర్థుల నామపత్రాలను తిరస్కరించినట్లు ప్రకటించారు. మిగిలిన 73 మంది అభ్యర్థుల నామపత్రాలు సక్రమంగా ఉన్నాయని.. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులవి తిరస్కరణకు గురికాలేదని పేర్కొన్నారు. ఈ నెల 29 వరకు ఉపసంహరణకు గడువు ఉంది. అదే రోజు ఎంత మంది బరిలో ఉంటారో తెలియనుంది. బరిలో ఉండే స్వతంత్ర అభ్యర్థులకు ఆరోజే గుర్తులు కేటాయిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు