logo

రాహుల్‌గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యం

‘కాంగ్రెస్‌ పార్టీ అంటేనే త్యాగాల పార్టీ.. దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన పార్టీ .. ఆ పార్టీ అగ్ర నాయకుడైన రాహుల్‌ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పని చేయాలని’ రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.

Published : 27 Apr 2024 02:35 IST

గోవిందరావుపేట, న్యూస్‌టుడే: ‘కాంగ్రెస్‌ పార్టీ అంటేనే త్యాగాల పార్టీ.. దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన పార్టీ .. ఆ పార్టీ అగ్ర నాయకుడైన రాహుల్‌ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పని చేయాలని’ రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో సీతక్క శుక్రవారం గోవిందరావుపేట మండలంలో పర్యటించారు. మచ్చాపూర్‌లో ఉపాధి కూలీల వద్దకు వెళ్లి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. లక్నవరం జలాశయాన్ని సందర్శించి అక్కడే పార్టీ మండలాధ్యక్షుడు పాలడుగు వెంకటకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల సమావేశంలో మంత్రి మాట్లాడారు. ‘కాంగ్రెస్‌ దేశానికి ఎంతో మేలు చేసింది. మాటల్లో చెప్పలేనంత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి నిరుపేదలకు అండగా నిలిచింది. ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్‌దే. కొందరు అదేపనిగా పార్టీని విమర్శించడంలో అర్థం లేదని’ అన్నారు. మహబూబాబాద్‌ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పోరిక బలరాంనాయక్‌ గతంలో కేంద్ర మంత్రిగా పని చేసిన సమయంలో ఎన్నో జాతీయరహదారులను, పాఠశాలలను మంజూరు చేయించి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశాడన్నారు. సమష్టి కృషితో తనను ఎలా గెలిపించారో అదే విధంగా బలరాంనాయక్‌ గెలుపు కోసం కృషి చేయాలని సీతక్క  పిలుపు నిచ్చారు. కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్‌, నాయకులు పి.ఎల్లారెడ్డి, కె.శ్రీనివాసరెడ్డి, ఎస్‌.జనార్దన్‌రెడ్డి, బి.రవిచందర్‌, డి.సుధాకర్‌, ఆర్‌.సీతారాంనాయక్‌, జె.సోమయ్య, కె.నాగేందర్‌రావు, పి.శ్రీకాంత్‌, ఎస్‌.జయమ్మ, ఎం.నాగమణి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని