logo

బాలికలదే పైచేయి

ఇంటర్‌ బోర్డు అధికారులు బుధవారం విడుదల చేసిన ఇంటర్‌ ఫలితాల్లో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో బాలికలే పై చేయి సాధించారు.

Published : 25 Apr 2024 04:14 IST

ఇంటర్‌లో పెరిగిన ఉత్తీర్ణత శాతం

భూపాలపల్లి, న్యూస్‌టుడే: ఇంటర్‌ బోర్డు అధికారులు బుధవారం విడుదల చేసిన ఇంటర్‌ ఫలితాల్లో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో బాలికలే పై చేయి సాధించారు. గతేడాది వచ్చిన ఫలితాలతో పోల్చుకుంటే ఈ ఏడాది స్వల్పంగా ఉత్తీర్ణత శాతం పెరిగింది. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రభుత్వరంగ, ప్రైవేటు జూనియర్‌ కళాశాలలు మొత్తం 35 వరకు ఉన్నాయి. గత మార్చిలో నిర్వహించిన జనరల్‌ విభాగం రెండో సంవత్సరంలో మొత్తం 1,415 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 989 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో బాలురు 387, బాలికలు 602 మంది ఉన్నారు. ఉత్తీర్ణత శాతం 69.89గా నమోదైంది. రెండో సంవత్సరం ఒకేషనల్‌లో మొత్తం 219 మంది పరీక్షకు హాజరుకాగా 157 మంది పాసయ్యారు. ఇందులో బాలురు 9, బాలికలు 148 మంది ఉన్నారు. 71.69 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మొదటి సంవత్సరం జనరల్‌ విభాగంలో 1,457 మంది హాజరుకాగా 854 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో బాలురు 324, బాలికలు 530 మంది ఉన్నారు. 58.61 శాతం ఉత్తీర్ణత శాతం నమోదైంది. మొదటి సంవత్సరం ఒకేషనల్‌ విభాగంలో మొత్తం 255 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 146 మంది పాసయ్యారు. వీరిలో బాలురు 05, బాలికలు 141 మంది ఉన్నారు. ఉత్తీర్ణత శాతం 57.25గా నమోదైంది. జిల్లా వ్యాప్తంగా గతేడాది (2022-23)తో పోల్చుకుంటే ఈ ఏడాది(2023-24)లో ఉత్తీర్ణత శాతం పెరిగింది. రాష్ట్ర స్థాయిలో పరిశీలిస్తే.. ఇంటర్‌ మొదటి సంవత్సరం జనరల్‌ విభాగంలో గతేడాది 26వ స్థానంలో ఉండగా ఈ ఏడాది 11 స్థానానికి ఎగబాకింది. రెండో సంవత్సరం జనరల్‌ విభాగంలో గతేడాదిలో 19 స్థానంలో ఉంటే ఈ ఏడాదిలో 8వ స్థానానికి చేరింది. రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థానం గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాదిలో అత్యధికంగా ఉత్తీర్ణత శాతం పెరిగిందని జిల్లా ఇంటర్‌ విద్యా నోడల్‌ అధికారి దేవరాజం తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు