logo

దుకాణాల్లో అధికారుల తనిఖీలు.. కేసుల నమోదు

వరంగల్‌, హనుమకొండ జిల్లాల పరిధిలో పలు దుకాణాల్లో మంగళవారం జిల్లా ఇన్‌స్పెక్టర్‌ బి.ప్రవీణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో తూనికలు, కొలతల అధికారులు తనిఖీలు చేపట్టి..

Published : 01 May 2024 05:50 IST

కాశీబుగ్గ, న్యూస్‌టుడే: వరంగల్‌, హనుమకొండ జిల్లాల పరిధిలో పలు దుకాణాల్లో మంగళవారం జిల్లా ఇన్‌స్పెక్టర్‌ బి.ప్రవీణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో తూనికలు, కొలతల అధికారులు తనిఖీలు చేపట్టి.. 7 కేసులు నమోదు చేశారు. హనుమకొండలో ఎలక్ట్రికల్‌, హార్డ్‌వేర్‌ దుకాణాల్లో తనిఖీలు చేయగా.. ఎమ్మార్పీ ధరలు, కంపెనీ చిరునామా సరిగాలేని పొరపాట్లను గుర్తించి నలుగురిపై కేసులు నమోదు చేశారు. వరంగల్‌ తూర్పులో పలు చరవాణి దుకాణాల్లో తనిఖీలు చేశారు. ఈ విషయం తెలిసి కొందరు షాపులను మూసేసి వెళ్లిపోయారు. వరంగల్‌లో నిబంధనలు పాటించని మూడు దుకాణాలపై కేసులు నమోదు చేశామని, పలువురికి నోటీసులు జారీ చేసినట్లు జిల్లా ఇన్‌స్పెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని