logo

పది మెట్లు పైకి..

పదోతరగతి ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. జిల్లా 94.62 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 12వ స్థానంలో నిలిచింది. ఈ సంవత్సరం మార్చిలో జరిగిన వార్షిక పరీక్షల్లో 8178 మంది బాలబాలికలు పరీక్ష రాయగా 7,738 మంది ఉత్తీర్ణులయ్యారు.

Published : 01 May 2024 06:14 IST

రాష్ట్రంలో జిల్లాకు 12వ స్థానం
ఉత్తీర్ణతలో బాలికలదే హవా

మానుకోట, న్యూస్‌టుడే: పదోతరగతి ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. జిల్లా 94.62 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 12వ స్థానంలో నిలిచింది. ఈ సంవత్సరం మార్చిలో జరిగిన వార్షిక పరీక్షల్లో 8178 మంది బాలబాలికలు పరీక్ష రాయగా 7,738 మంది ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది ఫలితాల్లో 85.54 ఉత్తీర్ణత శాతంతో రాష్ట్రంలో 22వ స్థానంలో ఉండగా ఈసారి అనూహ్యంగా పది స్థానాల పైకి చేరుకుంది. 95.51 శాతంతో బాలికల ఉత్తీర్ణత శాతమే ఎక్కువగా ఉంది. 93.04 శాతంతో 2022లో, 86.72 శాతంతో 2023లో వరుసగా ఈసారి బాలికలేే ఉత్తీర్ణతలో పైచేయిగా ఉండడం విశేషం. వివిధ యాజమాన్యాల ప్రభుత్వ పాఠశాలలు 49 వంద శాతం ఫలితాలు సాధించాయి.

14 మందికి 10 జీపీఏలు

పదో తరగతి ఫలితాల్లో జిల్లాలో వివిధ ప్రభుత్వ యాజమాన్యాలకు చెందిన పాఠశాలల్లోని 14 మంది విద్యార్థులు 10 జీపీఏను సాధించారు. బీసీ సంక్షేమ 4, ఆదర్శ 5, మైనార్టీ గురుకులాలు 2, సాంఘిక సంక్షేమ 1, గిరిజన సంక్షేమ 1, జడ్పీ పాఠశాలలో ఒకరు పది జీపీఏ సాధించారు.

ఫలితాల్లో కేజీబీవీల ప్రతిభ

జిల్లాలోని 15 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఏడు కేజీబీవీలు పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణతను సాధించాయి. అన్నింటి ఉత్తీర్ణత శాతం 94.58గా ఉందని జీసీడీఓ జి.విజయకుమారి తెలిపారు.

నాడు ‘జీరో’ నేడు వందశాతం

గార్ల, న్యూస్‌టుడే: గత విద్యాసంవత్సరంలో పదోతరగతిలో సున్నా ఫలితాలు సాధించిన పెద్దకిష్టాపురం ఉన్నత పాఠశాల నేడు వంద శాతం ఫలితాలతో నిలిచింది. గతేడాది పది మంది విద్యార్థులు పరీక్షలు రాయగా ఉత్తీర్ణత సాధించలేదు. దీంతో ఈ పాఠశాలపై కలెక్టరు, జిల్లా విద్యాశాఖాధికారి ప్రత్యేక దృష్టి సారించారు. ఈ విద్యా సంవత్సరంలో 16 మంది విద్యార్థులకు 16 మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రధానోపాధ్యాయుడు బి.చంద్రమోహన్‌, ఉపాధ్యాయులను గ్రామస్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు.

జడ్పీ పాఠశాలల్లో ..

జిల్లాలోని 26 జడ్పీ ఉన్నత పాఠశాలలు వందశాతం ఉత్తీర్ణతను సాధించాయి. రామాస్‌ (మహబూబాబాద్‌),  గూడూరు (బాలురు, బాలికలు), బయ్యారం, పుల్లూరు, ఎల్లంపేట, చింతపల్లి, చిన్నగూడూరు, దాట్ల, ముప్పారం కలాన్‌, నేరడ, రాజులకొత్తపల్లి, కుమ్మరికుంట్ల, గార్ల (బాలికలు),  ఉప్పలపాడు, పెద్దకిష్టాపురం, వీఎస్‌ లక్ష్మీపురం, కొత్తూరు, మచ్చర్ల, కొత్తపోచారం, పెద్దనాగారం, వెంకట్రామపురం, వడ్డేకొత్తపల్లి, అయోధ్యపురం, మద్దివంచ, బలపాల పాఠశాలలున్నాయి.

మహబూబాబాద్‌, మరపెడ ఆదర్శ పాఠశాలలున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని