logo

‘పది’లో సత్తా చాటారు

రాష్ట్ర విద్యాశాఖ మంగళవారం ప్రకటించిన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. రాష్ట్రంలో గతేడాది 11వ స్థానం రాగా.. ఈసారి జిల్లాను 10వ స్థానంలో నిలిపారు.

Updated : 01 May 2024 06:39 IST

జిల్లాలో ఉత్తమ ఫలితాలు సాధించడంతో డీఈవో అబ్దుల్‌  హైకి పుష్పగుచ్ఛం అందించి అభినందిస్తున్న కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌

వరంగల్‌ విద్యావిభాగం, న్యూస్‌టుడే: రాష్ట్ర విద్యాశాఖ మంగళవారం ప్రకటించిన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. రాష్ట్రంలో గతేడాది 11వ స్థానం రాగా.. ఈసారి జిల్లాను 10వ స్థానంలో నిలిపారు. మొత్తం 12,020 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 11,538 మంది (95.99 శాతం) ఉత్తీర్ణత సాధించారు. గతేడాది 11,720 మంది పరీక్షలు రాయగా 10,671 మంది (91.05 శాతం) పాసయ్యారు. ఈ ఏడాది ఐదు శాతానికిపైగా ఉత్తీర్ణత పెరిగింది. ఫలితాల్లో జిల్లాలో బాలికలే పైచేయి సాధించారు. 5,625 మంది బాలికలు పరీక్షలకు హాజరుకాగా 5,464 మంది (97.14 శాతం), బాలురు 6,395 మంది రాయగా.. 6,074 మంది (94.98 శాతం) ఉత్తీర్ణత సాధించారు.  జిల్లాలో మొత్తం 151 పాఠశాలలు వందశాతం ఉత్తీర్ణత సాధించగా.. అందులో ప్రభుత్వ పాఠశాలలు 65, ప్రైవేటు పాఠశాలలు 86 ఉన్నాయి. దామెర మండలం 98.40 శాతంతో జిల్లాలో మొదటి స్థానంలో ఉండగా కమలాపూర్‌ మండలం 89.58 శాతంతో చివరి స్థానంలో నిలిచింది. 345 మంది విద్యార్థులు 10 జీపీఏ తెచ్చుకున్నారు.

జూన్‌ 3 నుంచి సప్లిమెంటరీ..

పదో తరగతి వార్షిక పరీక్షల్లో తప్పిన విద్యార్థులకు జూన్‌ 3 నుంచి 13 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. మే 16లోగా సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఫీజు చెల్లించాలి. రివాల్యువేషన్‌ కోసం రూ.వెయ్యి, రీకౌటింగ్‌ కోసం రూ.500 చెల్లించాలని, దీనికి 15 రోజుల గడువు ఉంటుందని విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని