logo

ఆయుధంతో జాగ్రత్త.. పేలుతుంది!

‘అధికారిక లెక్కల ప్రకారం వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో 201 లైసెన్స్‌డ్‌ ఆయుధాలున్నాయి. ఇప్పటికే 200 మంది ఠాణాల్లో అప్పగించారు. ఒకరు మాత్రం విదేశాలకు వెళ్లారు. ఆయన అనుమతి పొందిన ఆయుధం బ్యాంక్‌ లాకరులో ఉన్నట్లు పోలీసుల వద్ద సమాచారం ఉంది.’

Published : 07 May 2024 06:48 IST

‘అధికారిక లెక్కల ప్రకారం వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో 201 లైసెన్స్‌డ్‌ ఆయుధాలున్నాయి. ఇప్పటికే 200 మంది ఠాణాల్లో అప్పగించారు. ఒకరు మాత్రం విదేశాలకు వెళ్లారు. ఆయన అనుమతి పొందిన ఆయుధం బ్యాంక్‌ లాకరులో ఉన్నట్లు పోలీసుల వద్ద సమాచారం ఉంది.’

వరంగల్‌క్రైం, న్యూస్‌టుడే: ఇటీవల వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో ఆయుధాల (తుపాకుల) మిస్‌ఫైరింగ్‌ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల జోరు కొనసాగుతోంది.. ఈ సమయంలో ఉద్రిక్త వాతావరణం ఉంటుంది. ఆయుధం ఉన్న వారు ఏదైనా ఘటనలకు పాల్పడవచ్చు. అందుకని ఎన్నికల షెడ్యూల్‌ వెలువడిన వెంటనే ఆయుధం కలిగినవారు స్వయంగా వాటిని సమీప ఠాణాలో డిపాజిట్‌ చేసి రసీదు తీసుకోవాలి. ఎన్నికలు పూర్తైన తర్వాత వారికి వాటిని తిరిగి ఇచ్చేస్తారు.

అనుమతి ఎవరికి ఇస్తారంటే..

సమాజంలో సంఘ విద్రోహ శక్తులు, ఇతరుల నుంచి తమకు ప్రాణహాని ఉందని భావించే వీఐపీలు, పారిశ్రామికవేత్తలు, పలువురు రాజకీయ నాయకులు ఆయుధ లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసుకుంటారు. దీనిపై పోలీసు శాఖ విచారణ జరిపి, అవసరం ఉంటేనే వారికి మంజూరు చేస్తుంది. ఈ అనుమతి మేరకు వారు ఆయుధం కొనుగోలు చేస్తారు.


ఇటీవల జరిగిన ఘటనలు

  • గత నెలలో భద్రాది కొత్తగూడెం జిల్లాలో నక్సల్స్‌ కూంబింగ్‌కు వెళ్లి వస్తున్న సీఆర్‌పీఎఫ్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌ (డీఎస్పీ) శేషగిరిరావు చేతిలో ఉన్న ఆయుధం ప్రమాదవశాత్తు పేలడంతో తూటా ఛాతీలోకి దూసుకెళ్లి ఆయన అక్కడికక్కడే మృతి చెందారు.
  • పది రోజుల కిందట వరంగల్‌ ఎనుమాముల మార్కెట్‌లో ఈవీఎంలు భద్రపర్చిన గదుల వద్ద విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ రాకేశ్‌ చేతిలో ఆయుధం మిస్‌ఫైర్‌ కావడంతో తూటా ఆయన కాలికి తగిలి తీవ్ర  గాయమైంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు