logo

వన ప్రేమికుడు... వేలుపుల సారయ్య

 ఆయన వయస్సు 70 ఏళ్లు.. మొక్కల సంరక్షణకు తనదైన శ్రద్ధతో పనిచేసే నిత్య శ్రామికుడు.. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని రామన్నగూడెం గ్రామానికి చెందిన వేలుపుల సారయ్యకు మొక్కల పెంపకమంటే ఎంతో మక్కువ. ప్రస్తుతం రామన్నగూడెం పంచాయతీ ఆధ్వర్యంలో రోడ్లకిరువైపులా హరితహారం పథకం కింద పెంపకం చేపట్టిన మొక్కలను సంరక్షించే బాధ్యతను చేపట్టారు. 

Updated : 08 May 2024 06:30 IST

ఏటూరునాగారం, న్యూస్‌టుడే:  ఆయన వయస్సు 70 ఏళ్లు.. మొక్కల సంరక్షణకు తనదైన శ్రద్ధతో పనిచేసే నిత్య శ్రామికుడు.. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని రామన్నగూడెం గ్రామానికి చెందిన వేలుపుల సారయ్యకు మొక్కల పెంపకమంటే ఎంతో మక్కువ. ప్రస్తుతం రామన్నగూడెం పంచాయతీ ఆధ్వర్యంలో రోడ్లకిరువైపులా హరితహారం పథకం కింద పెంపకం చేపట్టిన మొక్కలను సంరక్షించే బాధ్యతను చేపట్టారు.  పంచాయతీ ఉపాధి పథకం కింద కూలీ మాత్రం చెల్లిస్తోంది. ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచే తన పనులు ప్రారంభిస్తారు. మొక్కల చుట్టూ తవ్వడం, గడ్డి, పిచ్చి మొక్కలను తొలగించడం, నీళ్లు పట్టడం వంటివి చేస్తుంటారు.  

రోడ్డు విస్తరణ పనుల్లో తొలగించిన మొక్కలను సేకరించి మళ్లీ నాటి సంరక్షించి పెద్ద చేశారు. తనకు ఒక్కగానొక్క కుమారుడు  కొవిడ్‌ సమయంలో మృతి చెందాడని, ప్రస్తుతం అంగన్‌వాడీ టీచర్‌గా పని చేసే తన కోడలు తన సంరక్షణ చూస్తోందన్నారు.  చెట్లను పెంచితే మనం ఉన్నా.. లేకున్నా.. అవి పది మందికి నీడనిస్తాయంటున్నారు. వేలుపుల సారయ్య లక్ష్యం ప్రతి ఒక్కరికీ ఆదర్శం కావాలని కోరుకుందాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని