logo

నాలుగో రోజు.. 431 మంది పోస్టల్‌ ఓటు వినియోగం

నాలుగో రోజు బుధవారం పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా 431 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు..

Published : 09 May 2024 02:04 IST

ఓటు హక్కు వినియోగించుకున్న బీఎల్‌వోలు

భూపాలపల్లి, న్యూస్‌టుడే: నాలుగో రోజు బుధవారం పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా 431 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.. భూపాలపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నాలుగు పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయగా ఇప్పటివరకు 1,893 మంది ఓటేశారని జిల్లా కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా తెలిపారు. సార్వత్రిక ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది, అత్యవసర సేవల్లో పాల్గొనే  ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలెట్‌ అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించగా, జిల్లాలో పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే వారు మొత్తం 2,245 మంది ఉన్నారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఈ నెల 10వ తేదీ వరకు ఎన్నికల సంఘం గడువు పెంచిందని, ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. భూపాలపల్లి జిల్లాలోని పలు మండలాలకు చెందిన పోలీసులు, రెవెన్యూ, బీఎల్‌వోలు, తదితర ప్రభుత్వ ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద తాగునీరు, తదితర మౌలిక సదుపాయాలు కల్పించారు. భూపాలపల్లి సీఐ నరేష్‌కుమార్‌ పర్యవేక్షణలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని