logo

అసంఘటితరంగ కార్మికులకు భరోసా

అసంఘటితరంగ కార్మికుల కోసం ప్రభుత్వం ‘ఈ-శ్రమ్‌ పోర్టల్‌’ను ప్రారంభించింది. గతేడాది నవంబరులో ప్రారంభమైన ఈ పోర్టల్‌లో కార్మికులు తమ పేర్లను నమోదు చేయించుకుంటున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు దాదాపు 2.50 లక్షల మంది పేర్లు నమోదు చేయించుకున్నారు. ఇంకా సుమారు 8.5 లక్షల మంది పేర్లు నమోదు చేయించుకోవాల్సి ఉంది.

Published : 27 Jan 2022 06:00 IST

‘ఈ-శ్రమ్‌ పోర్టల్‌’తో పలు ప్రయోజనాలు

ఏలూరు అర్బన్‌, న్యూస్‌టుడే: అసంఘటితరంగ కార్మికుల కోసం ప్రభుత్వం ‘ఈ-శ్రమ్‌ పోర్టల్‌’ను ప్రారంభించింది. గతేడాది నవంబరులో ప్రారంభమైన ఈ పోర్టల్‌లో కార్మికులు తమ పేర్లను నమోదు చేయించుకుంటున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు దాదాపు 2.50 లక్షల మంది పేర్లు నమోదు చేయించుకున్నారు. ఇంకా సుమారు 8.5 లక్షల మంది పేర్లు నమోదు చేయించుకోవాల్సి ఉంది.

అర్హులు వీరే..

16 ఏళ్ల నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు కలిగిన అసంఘటితరంగ కార్మికులు. ● ఉపాధి కూలీలు, చిన్న, సన్నకారు రైతులు, రైతు కూలీలు, మత్స్యకారులు, దుకాణాలు, సంస్థల్లో పనిచేసేవారు, హోటళ్లలో పనిచేసేవారు, మోటారు రవాణా కార్మికులు, భవన, ఇతర నిర్మాణ కార్మికులు, వివిధ చేతివృత్తుల్లో పనిచేసేవారు, స్వయం ఉపాధి పొందుతున్నవారు, కేంద్ర ప్రభుత్వ పథకాల్లో పనిచేస్తున్న అంగన్‌వాడీలు, ఆశ కార్యకర్తలు, రోజువారీ కూలీలు.

ఈపీఎఫ్‌, ఈఎస్‌ఐ సదుపాయం లేని కార్మికులందరూ ఈ-శ్రమ్‌ పోర్టల్‌లో పేర్లు నమోదు చేయించుకోవచ్ఛు

ఈ పోర్టల్‌లో పేర్లు నమోదు చేయించుకున్న వారికి ఈ-శ్రమ్‌ రిజిస్ట్రేషన్‌ కార్డును వెంటనే ఇస్తారు.

ప్రయోజనాలు ఇవీ..

రూ.2 లక్షల వరకు వ్యక్తిగత ప్రమాద బీమా ● అసంఘటితరంగ కార్మికులకు ప్రభుత్వం అమలుచేసే అన్ని సంక్షేమ పథకాలను ఈ-శ్రమ్‌ పోర్టల్‌లో నమోదు కావడం ద్వారా పొందవచ్చు ● అసంఘటితరంగ కార్మికుల డేటాబేస్‌ ఆధారంగా భవిష్యత్తులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తాయి. వివిధ అంశాల్లో శిక్షణ, ఉపాధి అవకాశాలను కల్పిస్తాయి● కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అసంఘటితరంగ కార్మికుల కోసం విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటాయి● వలస కార్మికులకు సదుపాయాలు కల్పిస్తారు.

పేర్ల నమోదు ఎక్కడ చేస్తారంటే..

గ్రామ/వార్డు సచివాలయాలు, ఉమ్మడి సేవా కేంద్రాలు, తపాలా, కార్మిక శాఖ కార్యాలయాలకు వెళ్లి ఈ-శ్రమ్‌ పోర్టల్‌లో పేర్ల నమోదు చేయించుకోవచ్ఛు దీనికి ఎలాంటి రుసుము చెల్లించనవసరం లేదు. ఒక ఇంట్లో అర్హత కలిగిన ఎంతమందైనా పేర్లు నమోదు చేయించుకోవచ్ఛు ఆధార్‌ కార్డు, చరవాణి నంబర్లను, సేవింగ్స్‌ బ్యాంకు ఖాతా వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది. ఆండ్రాయిడ్‌ మొబైల్‌ ద్వారా కూడా పేర్లు నమోదు చేయించుకోవచ్ఛు www.e-SHRAM.in లో లాగిన్‌ అయి వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. జిల్లాలో అర్హత కలిగిన అసంఘటితరంగ కార్మికులందరూ ఈ-శ్రమ్‌ పోర్టల్‌లో పేర్లు నమోదు చేయించుకుని ప్రభుత్వపరంగా లభించే ప్రయోజనాలను పొందాలని ఉప కార్మిక కమిషనరు ఎన్‌.సుబ్రహ్మణ్యం కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని