logo

వలల్లో భారీగా చిక్కుతున్న క్యాట్‌ఫిష్‌

ఉండి కాలువలో క్యాట్‌ఫిష్‌ భారీగా దొరుకుతున్నాయి. చేపల కోసం వలలు వేస్తున్న వారికి నిషేధిత ఈ క్యాట్‌ఫిష్‌ భారీగా వచ్చి పడటంతో వీటిని తొలగించడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్థానికంగా వీటిని ఎవ్వరూ తినరు. భారీ సైజులో ఉండే ఇవి వలల్లో

Updated : 20 May 2022 06:17 IST


ఉండి కాలువలో దొరికాయి ఇలా..

గరగపర్రు (పాలకోడేరు), న్యూస్‌టుడే: ఉండి కాలువలో క్యాట్‌ఫిష్‌ భారీగా దొరుకుతున్నాయి. చేపల కోసం వలలు వేస్తున్న వారికి నిషేధిత ఈ క్యాట్‌ఫిష్‌ భారీగా వచ్చి పడటంతో వీటిని తొలగించడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్థానికంగా వీటిని ఎవ్వరూ తినరు. భారీ సైజులో ఉండే ఇవి వలల్లో పడటం వల్ల అవి చిరిగిపోవడం తప్ప ఉపయోగం లేదని మత్స్యకారులు వాపోతున్నారు. భీమవరం- తాడేపల్లిగూడెం మార్గంలోని ఉండి కాలువ వంతెన సమీపంలో ఓ వ్యక్తి వేసిన బెండు వలలో 20కి పైగా క్యాట్‌ఫిష్‌ పడటంతో స్థానికులు వీటిని ఆసక్తిగా తిలకించారు. ఒక్కో క్యాట్‌ఫిష్‌ ఐదు కిలోలపైనే ఉంది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు