logo

పావు కదిపితే ప్రత్యర్థికి చెమటలే !

మేధస్సు పెంచే క్రీడ చదరంగంలో రాటుదేలుతున్నారు.. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన పలువురు విద్యార్థులు. ఇప్పటికే జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో విజయాలు సాధించడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో ర్యాపిడ్‌ చెస్‌ రేటింగ్‌ సాధించారు. ఓవైపు చదువులో రాణిస్తూ, మరోవైపు నిరంతర సాధనతో చెస్‌లో గ్రాండ్‌ మాస్టర్లుగా ఎదగాలనుకుంటున్నారు.

Published : 30 Jun 2022 04:53 IST

చదరంగంలో రాణిస్తున్న జంగారెడ్డిగూడెం విద్యార్థులు

జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే

మేధస్సు పెంచే క్రీడ చదరంగంలో రాటుదేలుతున్నారు.. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన పలువురు విద్యార్థులు. ఇప్పటికే జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో విజయాలు సాధించడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో ర్యాపిడ్‌ చెస్‌ రేటింగ్‌ సాధించారు. ఓవైపు చదువులో రాణిస్తూ, మరోవైపు నిరంతర సాధనతో చెస్‌లో గ్రాండ్‌ మాస్టర్లుగా ఎదగాలనుకుంటున్నారు.

గ్రాండ్‌ మాస్టర్‌ లక్ష్యం 

కోనేరు హంపి నా అభిమాన క్రీడాకారిణి. గ్రాండ్‌ మస్టార్‌ కావాలన్నది నా లక్ష్యం. నాలుగో తరగతిలో ఉండగా అండర్‌-8 విభాగంలో చదరంగం పోటీల్లో పాల్గొన్నా. నాన్న సూర్యనాగేశ్వరరావు ద్వారా చెస్‌పై ఇష్టం పెరిగింది. శిక్షకురాలు సరళ మాధవి మెలకువలు నేర్పారు. 2018 నుంచి ఇప్పటి వరకు 15 సార్లు జిల్లాస్థాయిలో ప్రథమ స్థానం సాధించా. 5 పర్యాయాలు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యా. అండర్‌-12 స్థాయిలో ఉండి 17 వాళ్లతో పోటీ పడ్ఢా’అని జంగారెడ్డిగూడేనికి చెందిన కన్నా సొనాలి శ్రీమణి కార్తిక తెలిపారు.

ప్రతిభ చూపా

నెల్లూరులో నిర్వహించిన అంతర్జాతీయ చెస్‌ పోటీల్లో 1,081 ర్యాపిడ్‌ రేటింగ్‌ సాధించా. కొద్ది రోజుల కిందట వైజాగ్‌లో నిర్వహించిన అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్నా. ఈ ఏడాది జిల్లా స్థాయి పోటీల్లో ప్రథమ స్థానం సాధించి రాష్ట్ర పోటీలకు ఎంపికయ్యా. జులై 9, 10 తేదీల్లో నెల్లూరులో నిర్వహించే రేటింగ్‌ పోటీల్లో పాల్గొంటానని ప్రగళ్లపాటి రోహిత్‌ వివరించారు.

అంతర్జాతీయంగా ర్యాపిడ్‌ రేటింగ్‌ సాధించా

చదరంగంలో నా అంతర్జాతీయ ర్యాపిడ్‌ రేటింగ్‌ 1,187. ఈ ఏడాది వైజాగ్‌లో నిర్వహించిన గ్రాండ్‌ మాస్టర్‌ పోటీల్లో పాల్గొన్నా. క్లాసిక్‌ విభాగంలోనూ అంతర్జాతీయ రేటింగ్‌ వచ్చే అవకాశం ఉంది. చిన్నప్పుడు మా మామయ్య రాజశేఖర్‌ నాతో పాటు మా అన్నయ్య కార్తిక్‌కు చెస్‌లో ప్రాథమిక అంశాలు నేర్పారు. 2018 నుంచి ఏటా జిల్లా పోటీల్లో మొదటి స్థానం సాధిస్తున్నా. విశ్వనాథన్‌ ఆనంద్‌ నాకు స్ఫూర్తి’ అని చల్లా నీరజ్‌ చెప్పారు.

మేధస్సు పెరుగుతుంది

చెస్‌ ఆడితే తెలివితేటలు పెరుగుతాయి. అందుకే ఈ అటను ఎంపిక చేసుకున్నా. మా తమ్ముడు నీరజ్‌తో పాటు 2017 నుంచి నేర్చుకుంటున్నా. 2019 వరకు అండర్‌-13 విభాగంలో జిల్లా స్థాయిలో మొదటి స్థానం సాధించా. అండర్‌-17 విభాగంలో భీమవరంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నా. అంతర్జాతీయ స్థాయిలో విశాఖలో నిర్వహించిన గ్రాండ్‌ మాస్టర్‌ పోటీల్లో పాల్గొన్నా. క్లాసిక్‌ రేటింగ్‌ వస్తుందని ఆశిస్తున్నా. శిక్షకురాలు సరళ మాధవి ప్రోత్సాహంతోనే ఇవి సాధ్యమయ్యాయి’ అని ఇంటర్‌ విద్యార్థి చల్లా కార్తిక్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని