logo

భద్రత కట్టుదిట్టం.. ఏర్పాట్లు ముమ్మరం

: ప్రధాని నరేంద్రమోదీ భీమవరం పర్యటన సందర్భంగా పెదఅమిరంలో బహిరంగ సభ ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దే పనుల్లో యంత్రాంగం నిమగ్నమైంది. సభా వేదికలు, ప్రాంగణంలో అధునాతన టెంట్లు వేసే పనులను రేయింబవళ్లు కొనసాగిస్తున్నారు. ప

Updated : 02 Jul 2022 06:21 IST

వేగంగా ప్రధాని సభ వేదిక పనులు

పెదఅమిరంలో సిద్ధమవుతున్న వేదిక

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: ప్రధాని నరేంద్రమోదీ భీమవరం పర్యటన సందర్భంగా పెదఅమిరంలో బహిరంగ సభ ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దే పనుల్లో యంత్రాంగం నిమగ్నమైంది. సభా వేదికలు, ప్రాంగణంలో అధునాతన టెంట్లు వేసే పనులను రేయింబవళ్లు కొనసాగిస్తున్నారు. పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో నిఘా పెంచి భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భద్రత అధికారులు, సిబ్బందికి సహకరించేలా స్థానిక పోలీసులకు సూచనలిచ్చారు. ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేశారు. వాహనాలు వెళ్లేందుకు అనుమతులు లేని రహదారుల్లో పోలీసులను నియమించారు.

బహిరంగ సభకు హాజరయ్యేవారంతా ప్రాంగణంలో కూర్చొనేవారికి అనువుగా ఏర్పాట్లు చేశారు. లోపలికి వెళ్లేందుకు, తిరిగొచ్చేందుకు ప్రత్యేక దారులు, వరుస క్రమాలను సిద్ధం చేశారు. తోపులాటకు ఆస్కారం లేకుండా చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యేలు చెరుకువాడ శ్రీరంగనాథరాజు, మంతెన రామరాజు, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు, భాజపా నాయకులు శ్రీనివాసవర్మ తదితరులు సభా ప్రాంగణంలో ఏర్పాట్లను పరిశీలించారు.

4న దుకాణాల మూసివేత..

వేడుకలను ప్రారంభించేందుకు ప్రధాన మంత్రి వస్తున్న నేపథ్యంలో ఈనెల 4న పట్టణంలో అన్ని దుకాణాలను మూసివేయాలని నిర్ణయించినట్లు భీమవరం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు మానేపల్లి సూర్యనారాయణగుప్త తెలిపారు. శుక్రవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేసినట్లు పేర్కొన్నారు.

అలరించిన నృత్యాలు..

అల్లూరి జయంతి ఉత్సవాల్లో భాగంగా భీమవరంలోని డాక్టర్‌ బీవీరాజు విద్యాసంస్థల ప్రాంగణంలో నిర్వహిస్తున్న సాంస్కృతిక ప్రదర్శనలు శుక్రవారం కొనసాగాయి. కళాశాల ముఖద్వారంలో ఏర్పాటు చేసిన వేదికపై విద్యార్థులు దేశనాయకుల వేషధారణలు, నృత్య ప్రదర్శనలతో అలరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని