అడుగడుగునా జన హారతి
తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఉమ్మడి జిల్లా పర్యటన రెండో రోజూ ఉత్సాహంగా సాగింది. పోలవరం నియోజకవర్గంలో గ్రామగ్రామాన పార్టీ శ్రేణులు, జనం నీరాజనం పలికారు.
తెదేపా అధినేత పర్యటనకు పోటెత్తిన శ్రేణులు
దారిపొడవునా నిరీక్షించి స్వాగతించిన జనం
చిన్నారిని ఎత్తుకొని అభివాదం చేస్తూ..
కొయ్యలగూడెం, గ్రామీణ, బుట్టాయగూడెం, పోలవరం, న్యూస్‌టుడే: తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఉమ్మడి జిల్లా పర్యటన రెండో రోజూ ఉత్సాహంగా సాగింది. పోలవరం నియోజకవర్గంలో గ్రామగ్రామాన పార్టీ శ్రేణులు, జనం నీరాజనం పలికారు. కొయ్యలగూడెం, బుట్టాయగూడెం, పోలవరం మండలాల్లో దారిపొడవునా పసుపు జెండాలు, ఫ్లెక్సీలతో పసుపుమయం చేశారు. చంద్రబాబు కోసం గంటల తరబడి వేచి చూశారు. గురువారం ఉదయం నరసన్నపాలెం కల్యాణ మండపంలో నిర్వహించిన బీసీ సదస్సు అనంతరం కొయ్యలగూడెం మీదుగా పోలవరం వరకు రోడ్‌షో సాగింది. బయ్యనగూడెం, కొయ్యలగూడెం, దిప్పకాయలపాడు, కన్నాపురం, పోలవరంలో ఆయన ప్రసంగించారు. బయ్యనగూడెంలో ఒకరు విల్లును బహూకరించగా చంద్రబాబు దానిని ఎక్కుపెట్టి ప్రజలకు చూపారు. అక్కడ మహిళలు హారతులు పట్టారు.
పోలవరం సభకు హాజరైన జనసందోహం
దొండపూడి రోడ్‌షోలో ప్రసంగిస్తున్న చంద్రబాబునాయుడు, హాజరైన జనం
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (27/01/2023)
-
World News
Handsome Man: శాస్త్రీయంగా ప్రపంచంలోనే అందమైన వ్యక్తి ఎవరంటే?
-
India News
Arvind Kejriwal: చర్చలకు పిలిచిన సక్సేనా.. నో చెప్పిన కేజ్రీవాల్
-
Technology News
Cola Phone: కోకాకోలా కొత్త స్మార్ట్‌ఫోన్.. విడుదల ఎప్పుడంటే?
-
Movies News
Haripriya: ఒక్కటైన ‘కేజీయఫ్’ నటుడు, ‘పిల్ల జమీందార్’ నటి
-
World News
Pakistan: పాక్ సంక్షోభం.. కనిష్ఠ స్థాయికి పడిపోయిన రూపాయి