logo

పోరాటం చేస్తున్నా పట్టించుకోరేం?

దెందులూరు మండలం దోసపాడు గ్రామ దళితులు, పేదలకు న్యాయం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ డిమాండ్‌ చేశారు.

Published : 03 Jun 2023 04:02 IST

కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేస్తున్న దోసపాడు గ్రామ దళితులు

ఏలూరు కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: దెందులూరు మండలం దోసపాడు గ్రామ దళితులు, పేదలకు న్యాయం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ డిమాండ్‌ చేశారు. సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ఆ  గ్రామ దళితులు, పేదలు తమ భూముల కోసం ఏడాది నుంచి పోరాటం చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. 1965-74 మధ్య కాలంలో ఇచ్చిన పట్టాలు, పాస్‌ పుస్తకాలు, రెవెన్యూ దస్త్రాలను పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. దస్త్రాలను తారుమారు చేసిన రెవెన్యూ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే జూన్‌ 10 తర్వాత ఆందోళనను తీవ్రతరం చేస్తామన్నారు. కార్యక్రమంలో వ్యకాసం జిల్లా నాయకులు సీహెచ్‌ జాన్‌రాజు, నాగేంద్ర, పవన్‌, మణి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని