logo

రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తు

రాష్ట్రంలో విధ్వంసకర అవినీతి పాలనను సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. తణుకులో సీఎం కన్వెన్షన్‌ హాలులో గురువారం నరసాపురం పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికల కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించారు.

Updated : 29 Mar 2024 04:46 IST

జెండాలు వేరైనా ఎజెండా ఒక్కటే : పురందేశ్వరి

మాట్లాడుతున్న భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, వేదికపై  నాయకులు

ఈనాడు డిజిటల్‌, భీమవరం, తణుకు గ్రామీణం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో విధ్వంసకర అవినీతి పాలనను సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. తణుకులో సీఎం కన్వెన్షన్‌ హాలులో గురువారం నరసాపురం పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికల కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘యువతకు ఉద్యోగాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. మహిళలకు రక్షణ లేదు, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారు. విద్వేషపూరిత పాలన సాగిస్తున్నారు. రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసమే పొత్తు ఏర్పడింది. భాజపా, తెదేపా, జనసేన పార్టీ జెండాలు వేరైనా ఎజెండా ఒక్కటే’ అని పేర్కొన్నారు.  ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలోని నరసాపురం, రాజమహేంద్రవరం పార్లమెంట్‌ స్థానాలతో పాటు అసెంబ్లీ స్థానాలను గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. మోదీ సుస్థిర పాలనతో దృఢమైన నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. పార్టీ ప్రయోజనాల కన్నా దేశ ప్రజల సంరక్షణే భాజపా లక్ష్యమని స్పష్టం చేశారు. అనంతరం నరసాపురం పార్లమెంట్‌ స్థాయి నాయకులు, కార్యకర్తలతో అంతర్గత సమావేశం నిర్వహించారు. ఎన్నికల సహాయ ఇన్‌ఛార్జి సిద్థార్థనాథ్‌ సింగ్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు సన్నారెడ్డి దయాకర్‌రెడ్డి, సాగి కాశీవిశ్వనాథ్‌రాజు, నరసాపురం పార్లమెంట్‌ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ, క్రమశిక్షణ సంఘం ఛైర్మన్‌ సత్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు నార్ని తాతాజీ, జిల్లా ప్రధాన కార్యదర్శి కొవ్వూరి వెంకటరెడ్డి, జిల్లా మహిళా మోర్చ అధ్యక్షురాలు శ్రీదేవి తదితరులు హాజరయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని