logo

సమరమే

సార్వత్రిక ఎన్నికల సమరానికి జిల్లా అధికార యంత్రాంగం సమాయత్తమైంది. ఏలూరు పార్లమెంట్‌తో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు

Updated : 18 Apr 2024 06:31 IST

ఇక ఎన్నికల జోష్‌!

ఏలూరు కలెక్టరేట్‌, భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల సమరానికి జిల్లా అధికార యంత్రాంగం సమాయత్తమైంది. ఏలూరు పార్లమెంట్‌తో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. గురువారం నుంచి నామపత్రాల అంకం మొదలు కానుండటంతో రాజకీయం మరింత వేడెక్కనుంది. పోలింగ్‌కు దాదాపు 25 రోజులు మాత్రమే ఉంది. దాంతో అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. కొన్నిచోట్ల ఇప్పటికే అభ్యర్థులు ఇంటింటికీ వెళ్లి ఓట్లు అడుగుతున్నారు. నామినేషన్లను 19న వేసేందుకు ఎక్కువ మంది ఏర్పాట్లు చేసుకున్నారు. శుక్రవారం ఏకాదశి కావడంతో అభ్యర్థులు   అదేరోజున నామపత్రాలు సమర్పించేందుకు సన్నద్ధులయ్యారు. నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల నుంచి జనాల్ని తరలించేందుకు ద్వితీయశ్రేణి నాయకులు కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల ఖర్చులపై ఎన్నికల సంఘం నిఘా ఉంది నామినేషన్‌ ప్రక్రియ నుంచి వారి ఖాతాలో ఖర్చులు నమోదు చేస్తారు. సభ, సమావేశాలకు, ఎన్నికల ప్రచార కార్యక్రమాలు, వినియోగిస్తున్న వాహనాలు తదితర ఖర్చులు అభ్యర్థి ఖాతాలోకి చేరతాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని