logo

ఆసరా సొమ్ము కోసం రోడ్డెక్కిన మహిళలు

వైఎస్‌ఆర్‌ ఆసరా నాలుగో విడత సొమ్ములు వెంటనే చెల్లించాలని కోరుతూ స్వయం సహాయక సంఘాల సభ్యులు సోమవారం మొగల్తూరు క్రాంతి పథం కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన చేశారు.

Published : 07 May 2024 05:41 IST

ఆందోళన చేస్తున్న ఎస్‌హెచ్‌జీ సభ్యులు
మొగల్తూరు, న్యూస్‌టుడే: వైఎస్‌ఆర్‌ ఆసరా నాలుగో విడత సొమ్ములు వెంటనే చెల్లించాలని కోరుతూ స్వయం సహాయక సంఘాల సభ్యులు సోమవారం మొగల్తూరు క్రాంతి పథం కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన చేశారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆసరా నగదు బ్యాంకు ఖాతాలో జమచేసేందుకు ఈ ఏడాది పిబ్రవరి 2న బటన్‌ నొక్కారని చెప్పారు. ఇటీవల ఎన్నికల ప్రచారానికి వచ్చిన చీఫ్‌విప్‌ ప్రసాదరాజు కూడా నిధులు విడుదలయ్యాయని తమ ఖాతాలకు ఎందుకు జమచేయలేదని మహిళలు ప్రశ్నించారు. నేటికి ఆ నగదు తమ ఖాతాకు జమకాలేదని వెంటనే జమచేయాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు