logo

‘ప్రజల ఆస్తులు కాజేసేందుకు జగన్‌ కుట్ర’

ప్రజల ఆస్తులను గుప్పెట్లో పెట్టుకుని స్వాహా చేసే కుట్రలో భాగంగానే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టాన్ని తెచ్చారని తెదేపా సీనియర్‌ నాయకుడు భూపతిరాజు తిమ్మరాజు,

Published : 09 May 2024 03:33 IST

కాళ్ల: మాట్లాడుతున్న రఘురామకృష్ణరాజు

ఆకివీడు, కాళ్ల, పాలకోడేరు, న్యూస్‌టుడే: ప్రజల ఆస్తులను గుప్పెట్లో పెట్టుకుని స్వాహా చేసే కుట్రలో భాగంగానే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టాన్ని తెచ్చారని తెదేపా సీనియర్‌ నాయకుడు భూపతిరాజు తిమ్మరాజు, తెదేపా ఉండి ఎమ్మెల్యే అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు కుమారుడు భరత్‌ పేర్కొన్నారు. వారు తెదేపా, జనసేన, భాజపా నాయకులతో కలిసి సిద్ధాపురం, కాళింగగూడెం, చినమిల్లిపాడు గ్రామాల పరిధిలో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ః గెలుపే ధ్యేయంగా కూటమి నాయకులు, శ్రేణులు సమష్టిగా కృషి చేయాలని కనుమూరి రఘురామకృష్ణరాజు కోరారు. కాళ్ల మండలం కోమటిగుంట గ్రామంలో బుధవారం నిర్వహించిన తెదేపా, జనసేన, భాజపా నాయకుల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వైకాపా గ్రామ అధ్యక్షుడు నక్కా శ్రీనివాస్‌, సీనియర్‌ నాయకులు వేగేశ్న వెంకటరాయవర్మ, బోణం శివకుమార్‌, పంచాయతీ వార్డు సభ్యులు పసుపులేటి శ్రీనివాస్‌, తాళ్లపూడి వెంకటేశ్వరరావు, కర్రి వెంకటరమణ, వీగిరెడ్డి అప్పారావు ఆధ్వర్యంలో 30 మంది తెదేపాలో చేరారు. ఆకివీడు, పాలకోడేరు మండలాల్లోని పలు గ్రామాల్లో కూటమి నాయకులు ఇంటింటి ప్రచారం చేశారు.


కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి

ఉండి: పెదపేటలో ప్రచారం చేస్తున్న ఇందిరా ప్రియదర్శిని

ఉండి, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం ఏర్పడితేనే రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం సాధ్యమని రఘురామకృష్ణరాజు కుమార్తె ఇందిరా ప్రియదర్శిని అన్నారు. ఉండి పరిధి పెదపేట, రాజులపేటలలో ఆమె స్థానిక నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. రఘురామకృష్ణరాజు సతీమణి రమాదేవి పడవలవానిపేట, గోరింతోటల్లో ప్రచారంలో పాల్గొన్నారు.  వైకాపా ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని భాజపా జిల్లా అధ్యక్షుడు నార్ని తాతాజీ పేర్కొన్నారు. ఉండిలో భాజపా మండల అధ్యక్షుడు యర్రా విక్రమ్‌ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని