logo

అరాచక పాలకులు మనకొద్దు: రఘురామ

అరాచక పాలకులు మనకొద్దని.. సార్వత్రిక ఎన్నికల తర్వాత జగన్‌ను రాజకీయాలకు శాశ్వతంగా దూరం చేద్దామని తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు.

Published : 10 May 2024 04:00 IST

ఉప్పరగూడెం: ప్రజలకు అభివాదం చేస్తున్న కనుమూరి

ఉండి, న్యూస్‌టుడే: అరాచక పాలకులు మనకొద్దని.. సార్వత్రిక ఎన్నికల తర్వాత జగన్‌ను రాజకీయాలకు శాశ్వతంగా దూరం చేద్దామని తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. మహదేవపట్నం గ్రామంలో తెదేపా మండల అధ్యక్షుడు కరిమెరక నాగరాజు, సర్పంచి వనిమా నాగ వెంకట సుబ్బలక్ష్మి, జనసేన మండల అధ్యక్షుడు యడవల్లి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో గురువారం జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికల తర్వాత జగన్‌ విదేశాలకు వెళ్లి తిరిగి రారని కడప సిస్టర్స్‌ చెబుతున్నారన్నారు. ఆయన వచ్చినా.. రాకున్నా రాజకీయంగా జగన్‌కు ఇవే చివరి ఎన్నికలు కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజల ప్రాణాలకు రక్షణ ఇచ్చే చంద్రబాబు ముఖ్యమంత్రిగా కావాలా...? ప్రాణాలు అవలీలగా తీయించే జగన్‌ కావాలా అనేది విజ్ఞులైన ఓటర్లు నిర్ణయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధిపై అద్భుత ప్రణాళికలు సిద్ధం చేసిన చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లకు పూర్తిస్థాయిలో మద్దతుగా నిలవాలని కోరారు. జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి జుత్తిగ నాగరాజు, తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పొత్తూరి వెంకటేశ్వరరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి జుత్తిగ శ్రీనివాస్‌, వీర మహిళ జిల్లా కార్యదర్శి గవర లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.  

కూటమి విజయం తథ్యం

ఆకివీడు: బుల్లెట్లపై యువతుల ప్రదర్శన

ఆకివీడు, న్యూస్‌టుడే: జగన్‌ పాలనతో అన్ని విధాలా నష్టపోయిన జనం తెదేపా, జనసేన, భాజపా కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని.. కూటమి 150 పైగా అసెంబ్లీ స్థానాలు, 22 నుంచి 23 ఎంపీ స్థానాల్లో గెలవడం ఖాయమని రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. ఆకివీడులోని పలు వార్డుల్లో ఆయన గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తొలుత వెలమపేట రామాలయంలో స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంపై ప్రచారం కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి కళ్లల్లో ఓటమి భయం కనిపిస్తోందన్నారు. ప్రచారంలో పలువురు మహిళలు, యువతులు బుల్లెట్లు నడుపుతూ ఆకట్టుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని