logo

మూడు రోజుల్లో సైకో పాలనకు చరమగీతం

అయిదేళ్లుగా సైకోపాలనతో విసిగిపోయిన రాష్ట్ర ప్రజలు మరో మూడు రోజుల్లో వైకాపా పాలనకు చరమగీతం పాడనున్నారని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, నరసాపురం ఎంపీ అభ్యర్ధి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు.

Published : 10 May 2024 04:06 IST

పాలకొల్లు రోడ్‌షోలో ఎన్డీయే అభ్యర్థులు

పాలకొల్లులో ఓపెన్‌ టాప్‌ జీపు ప్రచారంలో నిమ్మల, శ్రీనివాసవర్మ, శ్యామలాదేవి, అంగర

పాలకొల్లు, న్యూస్‌టుడే:  అయిదేళ్లుగా సైకోపాలనతో విసిగిపోయిన రాష్ట్ర ప్రజలు మరో మూడు రోజుల్లో వైకాపా పాలనకు చరమగీతం పాడనున్నారని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, నరసాపురం ఎంపీ అభ్యర్ధి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. ఎన్టీయే తరఫున బరిలో నిలిచిన వీరు పాలకొల్లు నియోజకవర్గంలో గురువారం రోడ్‌షో నిర్వహించారు. పాలకొల్లు మండలం పూలపల్లిలో ప్రారంభమైన రోడ్‌షోలో దివంగత సినీనటుడు కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి, మాజీ ఎమ్మెల్సీ అంగర రామమోహన్‌ ఎన్టీయే అభ్యర్థులకు మద్దతుగా పాల్గొన్నారు. పాలకొల్లు రైల్వేగేటు, గాంధీ బొమ్మల కూడలి,. మెయిన్‌రోడ్‌ మీదుగా యడ్లబజార్‌ వరకు పట్టణంలో సాగిన రోడ్‌షో అక్కడి నుంచి పోడూరు మండలం పెనుమదంలోకి ప్రవేశించింది. మట్టపర్రు జిన్నూరు, వడ్లవానిపాలెం చింతపర్రు, లంకలకోడేరు, వెలివెల, ఆగర్తిపాలెం, దిగమర్రుమీదుగా పెదమామిడిపల్లి, కాజ, చించినాడ, యలమంచిలి, ఆర్యపేట, మేడపాడు, శిరగాలపల్లి, అబ్బిరాజుపాలెం, దొడ్డిపట్ల వరకు సాగింది. దారి పొడవునా ప్రజలు ఎన్టీయే అభ్యర్థులకు పూల జల్లులతో హారతులు పట్టారు. ప్రధాన కూడళ్లలో ముఖ్యనాయకులతో కరచాలనం చేస్తూ ఓట్లు అభ్యర్థించారు. రోడ్‌షోలో వేలాదిగా ఎన్టీయే కార్యకర్తలు ద్విచక్రవాహన ర్యాలీగా తరలివచ్చారు. సుమారు 100 కి.మీ. మేర రోడ్‌షో సాగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు