logo

ఉద్యోగాలేవి జగన్‌

ఆశలు ఆవిరై..  బతుకు భారమైన  వేళ నిరుద్యోగులందరూ ఆవేదనతో రగిలిపోతున్నారు. అరకొర జీతాలతో జీవితాలను నెట్టుకొస్తున్నారు.

Updated : 10 May 2024 05:44 IST

ఏటా జాబు క్యాలెండరు వట్టి మాటే
నిరుద్యోగుల ఆశలు నీరుగార్చిన వైకాపా సర్కారు
కలిదిండి, ఏలూరు అర్బన్‌, ముదినేపల్లి, న్యూస్‌టుడే

ఆశలు ఆవిరై..  బతుకు భారమైన  వేళ నిరుద్యోగులందరూ ఆవేదనతో రగిలిపోతున్నారు. అరకొర జీతాలతో జీవితాలను నెట్టుకొస్తున్నారు.

వైకాపా ఏలుబడిలో నిరుద్యోగులు నిండా మునిగిపోయారు. 2019 ఎన్నికల సమయంలో ‘ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తాం’ అంటూ అప్పటి ప్రతిపక్ష నేత జగన్‌ చెప్పిన అబద్ధాలు వాళ్ల జీవితాలను అంధకారం చేశాయి. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేస్తారన్న నమ్మకంతో.. ఎలాగైనా ఉద్యోగం సాధించాలన్న పట్టుదలతో.. పోటీ పరీక్షల్లో మెరుగైన ఫలితాల కోసం సంవత్సరాల తరబడి శిక్షణ కేంద్రాలకు వెళ్లారు. పూట గడవని కుటుంబాల్లో ప్రతిభావంతులు అప్పులు చేసి మరీ శిక్షణ తీసుకున్నారు. అయిదేళ్లలో ఐదుసార్లు నోటిఫికేషన్లు పడితే.. ఏదో ఒకటి కచ్చితంగా కొట్టేయొచ్చని..తమ ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కొచ్చని ఆశ పడ్డారు. తామంతా ఘోరంగా మోసపోయామని తెలిసేటప్పటికి 2024 ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైంది.

నిర్వహించిన ఉద్యోగ మేళాలు

2023లో 75 ఉద్యోగ మేళాల ద్వారా వివిధ ప్రైవేటు సంస్థల్లో సుమారు 2,596 మంది, 2024లో ఇప్పటి వరకు 16 ఉద్యోగ మేళాల ద్వారా 650 మందికి మాత్రమే ఉద్యోగాలు కల్పించారు.

నిరుద్యోగులను మోసం చేయడమే కాకుండా మరోసారి వంచనకు గురి చేయాలన్న ఆలోచనతో నాలుగున్నరేళ్లు గుర్తుకురాని డీఎస్సీ నోటిఫికేషన్‌ను ఎన్నికల వేళ హడావుడిగా విడుదల చేశారు. ఎన్నో అనుమానాలు.. ఇంకెన్నో సంశయాలు మనసును కుదిపేస్తున్నా.. ఆ నోటిఫికేషన్‌ అయినా అక్కరకొస్తుందని భావించిన నిరుద్యోగులకు మళ్లీ నిరాశే మిగిలింది. ఎన్నికల నియమావళి అమలు నేపథ్యంలో డీఎస్సీ వెనక్కి వెళ్లిపోయింది. ఇంకెన్నిసార్లు మాయ చేస్తావ్‌ జగనన్నా.. అంటూ నిరుద్యోగులు మండిపడుతున్నారు.

ఉపాధ్యాయ ఖాళీల వివరాలు.. ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 1800 వరకు ఉపాధ్యాయ ఖాళీలుండేవి. నూతన విద్యావిధానం పేరుతో 3, 4, 5 తరగతులను విలీనం చేయడం ద్వారా ఉపాధ్యాయ ఖాళీల సంఖ్య తగ్గిపోయింది. తాజాగా వైకాపా ప్రభుత్వం ప్రకటించిన డీఎస్సీలో 228 ఉపాధ్యాయ ఖాళీలను మాత్రమే భర్తీ చేయనున్నట్లు తెలిపింది.

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో నిరుద్యోగులు 13,864 మంది ఉపాధి కార్యాలయంలో నమోదై ఉన్నారు. ఏలూరులోని జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో రోజూ 50 నుంచి 100 మంది వరకు నిరుద్యోగులు పేర్లు నమోదు చేయించుకుంటూ ఉంటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని