logo

CM Jagan: జగన్‌ సారు... వారధిని పట్టించుకోరు

ఇది సీఎం జగన్‌ సొంత ఇలాకా పులివెందుల నియోజకవర్గంలోని ప్రధాన వంతెన. చక్రాయపేట మండలం గండిక్షేత్రం నుంచి శ్రీసత్యసాయి జిల్లా కదిరి మార్గంలో పాపఘ్ని నదిపై ఉన్న ఈ వంతెన రెండేళ్ల కిందట భారీ వర్షాలకు కొట్టుకుపోయింది.

Updated : 25 Jan 2024 03:21 IST

ఈనాడు, కడప: ఇది సీఎం జగన్‌ సొంత ఇలాకా పులివెందుల నియోజకవర్గంలోని ప్రధాన వంతెన. చక్రాయపేట మండలం గండిక్షేత్రం నుంచి శ్రీసత్యసాయి జిల్లా కదిరి మార్గంలో పాపఘ్ని నదిపై ఉన్న ఈ వంతెన రెండేళ్ల కిందట భారీ వర్షాలకు కొట్టుకుపోయింది. దీంతో అధికారులు తాత్కాలికంగా పునరుద్ధరించారు. ఇప్పటికీ శాశ్వత ప్రాతిపదికన వంతెన నిర్మాణం చేపట్టలేదు. స్వయనా సీఎం ఇలాకాలోనే వంతెన నిర్మాణం జరగకపోవడంపై ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. రెండు జిల్లాలను కలిపే వారధి నిర్మాణంపై తాత్సారంతో భారీగా వరదలొచ్చే పక్షంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగనుంది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని