logo

ముత్యాల తలంబ్రాల ప్యాకెట్లు తయారీ

ఒంటిమిట్ట రామాలయం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 22న నిర్వహించే సీతారాముల కల్యాణం తిలకించడానికి తరలిరానున్న భక్తులకు పంపిణీ చేయడానికి ముత్యాల తలంబ్రాలు ప్యాకెట్లు సిద్ధం చేస్తున్నారు.

Published : 18 Apr 2024 03:56 IST

ఒంటిమిట్ట, న్యూస్‌టుడే: ఒంటిమిట్ట రామాలయం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 22న నిర్వహించే సీతారాముల కల్యాణం తిలకించడానికి తరలిరానున్న భక్తులకు పంపిణీ చేయడానికి ముత్యాల తలంబ్రాలు ప్యాకెట్లు సిద్ధం చేస్తున్నారు. కల్యాణ వేదిక ప్రాంగణంలో ఉన్న యాత్రికుల విడిది భవనంలో ప్రత్యేక అధికారిణి ప్రశాంతి ఆధ్వర్యంలో తొలిరోజు గురువారం 60 వేల పొట్లాలను తయారు చేయించారు. ప్రతి ప్యాకెటులో అక్షింతలు, కంకణం, ముత్యం ఉంటాయి. జేఈవో వీరబ్రహ్మం, సీఈ నాగేశ్వరావు, డిప్యూటీ ఈవోలు నటేష్‌బాబు, శివప్రసాద్‌ పరిశీలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని