logo

ప్రతి హృది నిండుగా... పురుషోత్తముని పండగ

ఒంటిమిట్ట కోదండరామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలిరోజు ధ్వజారోహణం క్రతువు వైభవంగా జరిగింది.

Published : 18 Apr 2024 04:00 IST

వైభవంగా ధ్వజారోహణం

ఒంటిమిట్ట, న్యూస్‌టుడే: ఒంటిమిట్ట కోదండరామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలిరోజు ధ్వజారోహణం క్రతువు వైభవంగా జరిగింది. తితిదే పాంచరాత్ర ఆగమ సలహాదారు కల్యాణపురం రాజేష్‌ భట్టార్‌ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం యాగశాలలో హోమాలను శాస్త్రోకంగా నిర్వహించారు. అనంతరం గరుత్మంతుని పటాన్ని ప్రదక్షిణ చేశారు. ఉదయం 10.30-11 గంటల వరకు మిథున లగ్నంలో ఆగమశాస్త్రబద్ధంగా గరుడ పటాన్ని ప్రతిష్ఠించారు. ధ్వజరోహణ ఘట్టం కనులపండువగా సాగింది. ధ్వజస్తంభానికి నవకలశ పంచామృతాభిషేకం చేశారు. వేదపండితులు వేదపారాయణం చేశారు.

భక్తులు పెద్దసంఖ్యలో హాజరై తిలకించారు. ఆలయానికి రద్దీ పెరగడంతో ఉదయం 11 గంటల నుంచి మహా లఘు దర్శనం అమలుచేశారు. రామనామస్మరణతో పురుషోత్తముడి దివ్య క్షేత్రం మార్మోగింది.  తితిదే డిప్యూటీ ఈవోలు నటేష్‌బాబు, శివప్రసాద్‌ పర్యవేక్షణలో రామాలయం నుంచి ముత్యాలను కల్యాణ ప్రాంగణంలో ఉన్న యాత్రికుల విడిది భవనానికి తీసుకెళ్లారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం డిప్యూటీ ఈవో ప్రశాంతి ఆధ్వర్యంలో ముత్యాల తలంబ్రాల ప్యాకెట్లను సిద్ధం చేశారు. సీఈ నాగేశ్వరావు, ఎస్‌ఈ జగదీశ్వర్‌రెడ్డి, డీఎఫ్‌వో శ్రీనివాసులు, ఈఈ సుమతి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని