logo

ఎన్నికల రణరంగానికి వేళాయె!

సార్వత్రిక ఎన్నికల్లో తలపడనున్న అభ్యర్థులు గురువారం నుంచి నామినేషన్లు దాఖలు చేయనున్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేట పార్లమెంటు స్థానానికి, మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు, రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు(ఎస్సీ), వైయస్‌ఆర్‌ జిల్లా కడప పార్లమెంటు స్థానంతో పాటు కడప, పులివెందుల, కమలాపురం, ప్రొద్దుటూరు, బద్వేలు(ఎస్సీ), జమ్మలమడుగు, మైదుకూరు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

Updated : 18 Apr 2024 04:55 IST

నేడు పలువురు అభ్యర్థుల నామినేషన్‌ దాఖలుకు ఏర్పాట్లు
20న పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ముహూర్తం ఖరారు
24న రాజంపేట, రైల్వేకోడూరుకు చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌
25న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పులివెందుల రాక
ఈనాడు, కడప

సార్వత్రిక ఎన్నికల్లో తలపడనున్న అభ్యర్థులు గురువారం నుంచి నామినేషన్లు దాఖలు చేయనున్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేట పార్లమెంటు స్థానానికి, మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు, రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు(ఎస్సీ), వైయస్‌ఆర్‌ జిల్లా కడప పార్లమెంటు స్థానంతో పాటు కడప, పులివెందుల, కమలాపురం, ప్రొద్దుటూరు, బద్వేలు(ఎస్సీ), జమ్మలమడుగు, మైదుకూరు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక నుంచి అభ్యర్థుల ఎన్నికల ప్రచారం సైతం హోరెత్తనుంది. వివిధ పార్టీల అగ్రనేతలు ప్రచారానికి రానున్నారు. ఇప్పటికే పీసీసీ అధ్యక్షురాలు, కడప ఎంపీగా పోటీ చేస్తున్న వైఎస్‌ షర్మిల ఇప్పటికే వైయస్‌ఆర్‌, అన్నమయ్య జిల్లాల్లో విస్తృత ప్రచారం చేపట్టారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీత షర్మిలకు మద్దతుగా గురువారం నుంచి ఎన్నికల ప్రచారంలో దిగనున్నారు. తెదేపా, జనసేన పార్టీ అధినేతలు చంద్రబాబునాయుడు, పవన్‌కల్యాణ్‌ ఈ నెల 24న రాజంపేట, రైల్వేకోడూరులలో ఎన్నికల ప్రచారానికి రానున్నారు. సాయంత్రం ఐదింటికి రాజంపేట, రాత్రి 7 గంటలకు రైల్వేకోడూరులో బహిరంగసభలు నిర్వహించనున్నారు. ఎన్డీఏ తరపున రాజంపేట పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తున్న భాజపా అభ్యర్థి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, తెదేపా రాజంపేట అభ్యర్థి సుగవాసి బాల సుబ్రహ్మణ్యం, జనసేన పార్టీ రైల్వేకోడూరు అభ్యర్థి శ్రీధర్‌కు మద్దతుగా జరిగే బహిరంగ సభల్లో వారు ప్రసంగించనున్నారు. రాత్రికి రైల్వేకోడూరులోనే చంద్రబాబు బస చేసి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. బహిరంగసభల ఏర్పాట్లపై తెదేపా మాజీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వేమన సతీష్‌, జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్‌రాజు బుధవారం సమావేశమై చర్చించారు.  


నెల 25న సీఎం జగన్‌ పులివెందులకు చేరుకుని ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంతోపాటు నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఇక్కడ నుంచి తెదేపా అభ్యర్థి బీటెక్‌ రవి ఈ నెల 24న నామినేషన్‌ వేయనున్నారు. రాజంపేట నుంచి తెదేపా అభ్యర్థి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం ఈనెల 24న నామినేషన్‌ దాఖలు చేయనుండగా,  వైకాపా అభ్యర్ధి ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి గురువారం నామినేషన్‌ వేయనున్నారు. ప్రొద్దుటూరులో తెదేపా అభ్యర్థి వరదరాజులరెడ్డి ఈ నెల 23న, వైకాపా అభ్యర్థి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి 22న, తంబళ్లపల్లెలో వైకాపా అభ్యర్థి ద్వారకనాథరెడ్డి గురువారం, 19న తెదేపా అభ్యర్థి జయచంద్రా రెడ్డి, రాయచోటిలో తెదేపా అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి 19న, వైకాపా నుంచి శ్రీకాంత్‌రెడ్డి 22న, మైదుకూరులో తెదేపా అభ్యర్థి పుట్టా సుధాకర్‌యాదవ్‌ ఈ నెల 22న, వైకాపా నుంచి రఘురామిరెడ్డి 18న నామినేషన్లు వేయనున్నారు.


పీలేరు నుంచి తెదేపా అభ్యర్థి నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి గురువారం, వైకాపా నుంచి చింతల రామచంద్రారెడ్డి ఈ నెల 25న, మదనపల్లెలో తెదేపా నుంచి షాజహాన్‌ బాషా శుక్రవారం నామినేషన్లు దాఖలు చేయనుండగా. వైకాపా అభ్యర్థి నిస్సార్‌ అహ్మద్‌ ఇంకా ముహూర్తం ఖరారు చేయలేదు. భాజపా రాజంపేట అభ్యర్థి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ నెల 24న  నామినేషన్‌ వేయనుండగా, వైకాపా అభ్యర్థి మిథున్‌రెడ్డి ఉభయ గోదావరి జిల్లాల్లో పార్టీ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నందున ఇంకా ఎప్పుడన్నది తేల్చుకోలేదు. కడపలో తెదేపా అభ్యర్థి మాధవి, వైకాపా నుంచి అంజాద్‌ బాషా ఈ నెల 24న నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. కడప పార్లమెంటు స్థానానికి తెదేపా నుంచి భూపేష్‌రెడ్డి గురువారం నామినేషన్‌ వేయనుండగా, మరోసారి మంచి రోజు చూసుకుని మరోసెట్‌ దాఖలు చేయనున్నారు. వైకాపా నుంచి అవినాష్‌రెడ్డి ఈనెల 20న నామినేషన్‌ దాఖలు చేయాలని భావిస్తున్నా అధికారికంగా ఖరారు కాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని