logo

అయిదేళ్ల వైకాపా పాలనంతా మోసం

అయిదేళ్ల వైకాపా పాలనలో రైతులు, యువత, అన్ని వర్గాలను జగన్‌ పూర్తిగా మోసం చేశారని వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ స్టార్‌ క్యాంపెయినర్‌, కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మీ అన్నారు.

Published : 01 May 2024 01:37 IST

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, స్టార్‌ క్యాంపెయినర్‌ పనబాక లక్ష్మి

మదనపల్లెకు వచ్చిన కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మీకి పుష్పగుచ్ఛం అందజేసి

స్వాగతం పలుకుతున్న కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్‌బాషా, నాయలు

మదనపల్లె పట్టణం, న్యూస్‌టుడే : అయిదేళ్ల వైకాపా పాలనలో రైతులు, యువత, అన్ని వర్గాలను జగన్‌ పూర్తిగా మోసం చేశారని వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ స్టార్‌ క్యాంపెయినర్‌, కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మీ అన్నారు. మంగళవారం మదనపల్లెకు వచ్చిన ఆమె కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్‌బాషాతో కలిసి ఆమె మాట్లాడారు. వైకాపా పాలనలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయని, ఎస్సీ, ఎస్టీలకు భద్రత లేకుండా పోయిందన్నారు. చంద్రబాబుకు రైతులు కష్టాలు తెలుసునని, మహిళల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారని తెలిపారు. తెదేపా అధికారంలోకి రాగానే భవిష్యత్తుకు గ్యారంటీ పథకాలను చంద్రబాబు అమలు చేసి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తారని తెలిపారు. తెదేపా అధికారంలోకి వచ్చాక వైకాపా రద్దు చేసిన సంక్షేమ పథకాలన్నింటినీ పునరుద్ధరిస్తామని తెలిపారు. ఒకప్పుడు రాష్ట్రంలో వరి ధాన్యం రాసులు కనిపించేవని నేడు ఇసుక కుప్పలు కనిపిస్తున్నాయన్నారు. తెదేపా అధికారంలోకి రాగానే ప్రజలకు ఇసుకను ఉచితంగా అందజేస్తామన్నారు. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్‌బాషా, భాజపా ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డిని గెలిపించుకోవాలన్నారు. సమావేశంలో తెదేపా నాయకులు నాదెళ్ల విద్యాసాగర్‌, ఆర్‌.మధుబాబు, జనసేన పార్టీ నాయకురాలు దారం అనిత తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని