logo

గండికోట నిర్వాసితులకు రూ.12 లక్షల పరిహారం

గండికోట నిర్వాసితులకు ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పునరావాస పరిహారం రూ.12 లక్షలు ఇస్తామని మాజీ మంత్రి, ఎన్‌డీఏ కూటమి జమ్మలమడుగు ఎమ్మెల్యే భాజపా అభ్యర్థి ఆదినారాయణరెడ్డి తెలిపారు.

Published : 01 May 2024 01:49 IST

దత్తాపురంలో రోడ్‌ షోలో మాట్లాడుతున్న ఆదినారాయణరెడ్డి, భూపేష్‌రెడ్డి

కొండాపురం, న్యూస్‌టుడే: గండికోట నిర్వాసితులకు ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పునరావాస పరిహారం రూ.12 లక్షలు ఇస్తామని మాజీ మంత్రి, ఎన్‌డీఏ కూటమి జమ్మలమడుగు ఎమ్మెల్యే భాజపా అభ్యర్థి ఆదినారాయణరెడ్డి తెలిపారు. మంగళవారం తిమ్మాపురం, లావనూరు, వెంకయ్యకాల్వ, పొట్టిపాడు, బెడుదూరు, యనమలచింతల, కొట్టాలపల్లె, కోనవారిపల్లె, కోడూరు, సిరిగేపల్లె, ఎర్రగుడి గ్రామాల్లో ఆదినారాయణరెడ్డి రోడ్‌ షో నిర్వహించగా, చామలూరు, సంకేపల్లె, సుగుమంచిపల్లె, దత్తాపురం, తాళ్లప్రొద్దుటూరు తదితర గ్రామాల్లో భూపేష్‌రెడ్డి పాల్గొన్నారు. గ్రామాల్లో ప్రజలు తమ సమస్యల వివరించి వినతులిచ్చారు. వారి బాధలను విన్న వారు పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. గండికోట ప్రాజెక్టు కోసం ఇళ్లు, భూములు త్యాగం చేస్తే నిర్వాసితుల సమస్యలను, బాధను పట్టించుకునేవారే లేక ఇబ్బంది పడుతున్నారని విమర్శించారు. గత తెదేపా ప్రభుత్వం నిర్వాసితులకు అండగా ఉంటూ రూ.1.86 ఉన్న ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీని పెంచి రూ.6.75 లక్షలు అందజేసిందని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం రూ.10 లక్షలు ఇస్తామని మాట ఇచ్చి ఐదేళ్లు గడిచినా ఇప్పటికీ మొదటి విడత 14 గ్రామాల నిర్వాసితులకు రూ.3.25 లక్షల అదనపు పరిహారం ఇవ్వలేదని మండిపడ్డారు. గండికోట నిర్వాసితుల బాధను చూస్తుంటే కన్నీరు వస్తుందన్నారు. జలాశయం పరిధిలో ముంపునకు గురైన 22 గ్రామాల సమస్యలను ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలనీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పునరావాస కాలనీల్లో మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. సంకేపల్లె- బొందలదిన్నె వంతెన పూర్తి చేస్తామన్నారు. రానున్న ఎన్నికల్లో తెదేపా కడప ఎంపీ అభ్యర్థి భూపేష్‌రెడ్డిని, ఎమ్మెల్యేగా తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆదినారాయణరెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో నాగేశ్వరరెడ్డి, నారాయణరెడ్డి, రామచంద్రారెడ్డి, నరసింహారెడ్డి, శంకర్‌రెడ్డి, గోరిశెట్టిబాబు, రామమునిరెడ్డి, రాఘవేంద్రారెడ్డి మాధవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని