logo

పెద్దిరెడ్డి కుటుంబం.... మాఫియాలకు నాయకత్వం!

రాజంపేట పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో పెద్దిరెడ్డి కుటుంబం వివిధ రకాల మాఫియాలకు నాయకత్వం వహిస్తోందని, దోపిడీయే ధ్యేయంగా అయిదేళ్లలో అడ్డగోలుగా వనరుల విధ్వంసానికి పాల్పడ్డారని మాజీ సీఎం, భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.

Published : 01 May 2024 06:04 IST

ఐక్యత చాటుతున్న నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, కూటమి నాయకులు

ములకలచెరువు గ్రామీణ, పీట©ఎం గ్రామీణ, న్యూస్‌టుడే: రాజంపేట పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో పెద్దిరెడ్డి కుటుంబం వివిధ రకాల మాఫియాలకు నాయకత్వం వహిస్తోందని, దోపిడీయే ధ్యేయంగా అయిదేళ్లలో అడ్డగోలుగా వనరుల విధ్వంసానికి పాల్పడ్డారని మాజీ సీఎం, భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. పెద్దతిప్పసముద్రం మండలం ట¨.సదుం పంచాయతీ చెన్న రాయునిపల్లి సమీపంలోని శ్రీచౌడేశ్వరదేవి ఆలయ ప్రాంగణంలో మంగళవారం ఏఎంసీ మాజీ ఛైర్మన్‌ శ్రీనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో తెదేపా, జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సదుం మండలంలో బీసీవై పార్టీ అధినేత రామచంద్రయాదవ్‌పై పెద్దిరెడ్డి అనుచరులు దాడికి పాల్పడడం అప్రజాస్వామికమన్నారు. కూటమి అధికారంలోకి రాగానే రౌడీయిజంపై ఉక్కుపాదం మోపుతామని, తంబళ్లపల్లె నియోజకవర్గంలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై పెట¨్టన కేసులు రద్దు చేస్తామన్నారు. పాపఘ్ని నదిలో ఇసుక అక్రమ తవ్వకాలతో వైకాపా నేతలు రూ.కోట్లు దోచుకున్నారన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మూడు పెద్ద ప్రాజెక్టులకు పీఎల్‌ఆర్‌ రూ.2,145 కోట్లు తీసుకొని రైతులకు నష్ట పరిహారం ఇవ్వకుండా పనులు చేపట్టారన్నారు. నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ రూ.100 కోట్లు అపరాధ రుసుం విధించడంతో విషయం బయటకు వచ్చిందని, లేదంటే పెద్దిరెడ్డి కుటుంబం 2 వేల కోట్లు దోచుకునేదన్నారు. రానున్న ఎన్నికల్లో పెద్దిరెడ్డి కుటుంబానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. సమావేశంలో తెదేపా తంబళ్లపల్లె ఎమ్మెల్యే అభ్యర్థి జయచంద్రారెడ్డి, భాజపా జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్‌, నాయకులు సాయినాథ్‌, చల్లపల్లి నరసింహారెడ్డి, త్యాగరాజు, సురేంద్ర యాదవ్‌, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని