logo

వానొస్తే పాట్లు... వైకాపాకు వేసేదెలా ఓట్లు?

వానొస్తే ఇది మదనపల్లె పట్టణం పరిస్థితి... సెల్లార్లు వాననీటితో నిండిపోతాయి... మురుగు కాలువలు పొంగుతాయి... వాన వెలిసిన తర్వాత ఎటు చూసినా దుర్వాసన, దుర్గంధం... ఏళ్లుగా పట్టణం వానాకాలంలో నిత్యం మునుగుతున్నా నాయకులు ప్రత్యామ్నాయం చూపలేకపోయారు.

Published : 09 May 2024 04:52 IST

ఎన్టీఆర్‌ కూడలిలో నిలిచిన వర్షపునీరు

న్యూస్‌టుడే, మదనపల్లె పట్టణం, గ్రామీణం, నేరవార్తలు: వానొస్తే ఇది మదనపల్లె పట్టణం పరిస్థితి... సెల్లార్లు వాననీటితో నిండిపోతాయి... మురుగు కాలువలు పొంగుతాయి... వాన వెలిసిన తర్వాత ఎటు చూసినా దుర్వాసన, దుర్గంధం... ఏళ్లుగా పట్టణం వానాకాలంలో నిత్యం మునుగుతున్నా నాయకులు ప్రత్యామ్నాయం చూపలేకపోయారు. అయిదేళ్ల వైకాపా పాలనలో కనీస ప్రత్యామ్నాయం కూడా చూపలేదు. దీంతో పట్టణంలో ప్రధాన కూడళ్లు మొదలుకుని శివారు ప్రాంతాల వరకు ఎటు చూసినా ఇక్కట్లు... అగచాట్లే. మంగళవారం రాత్రి మదనపల్లెలో భారీ వర్షం కురిసింది. కాలువల్లో నీరు పారకుండా నిలిచిపోయింది. కల్వర్టుల్లో చెత్తాచెదారం పేరుకుంది. నిత్యం రద్దీగా ఉండే ఎన్టీఆర్‌ కూడలి ప్రాంతంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. యజమానులు మోటార్ల సాయంతో నీటిని బయటకు తోడుకున్నారు. ఆ చిత్రాలే ఇవి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని